Health

వీటిని తింటుంటే మీ ఊపిరితిత్తులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి.

పొగతాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ముఖ్య కారకం. సిగరెట్ పొగ కారణంగా చాలా మంది వ్యక్తుల్లో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. క్రమేపి దీనికారణంగా ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణితి అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో ధూమపానం చేయని వారిలో 25శాతం మంది లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా ముఖ్యం.

వాయు కాలుష్యం, సిగరేట్, పొగాకు, వాతావరణ కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇవి పల్మనరీ ఫైబ్రోసిస్ (పిఎఫ్) వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు దారితీస్తాయి. ఈ పిఎఫ్ తో బాధపడుతున్న వారి ఆయుష్షును డాక్టర్లు కూడా అంచనా వేయలేరు. ఇది జీవనశైలి, ఆరోగ్యం, వయస్సు, ఆరోగ్యం, రోగ నిర్దారణ సమయంలో వ్యాధుల తీవ్రత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. విటమిన్ సి.. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది సెల్యులార్ నష్టాన్ని నివారిస్తుంది.

ఈ విటమిన్ సి నారింజ, స్ట్రాబెర్రీలు, మిరియాలు, బ్రోకలీ, బ్రస్సెల్ మొలకలు, నిమ్మకాయలు, బంగాళాదుంపలు వంటి సిట్రస్ పండ్లలో పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి.. విటమిన్ డి లోపం కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ విటమిన్ డి లోపం ఆస్తమాకు దారితీస్తుంది. కాడ్ లివర్ ఆయిల్, సాల్మన్, స్వార్డ్ ఫిష్, ట్యూనా చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, సార్డినెస్, గొడ్డు మాంసం కాలేయంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. ఎములను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్ ఎ.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడే విటమిన్లలో విటమిన్ ఎ ఒకటి. అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. ఈ విటమిన్ ఎ నారింజ, ఆకు కూరలు, పసుపు పచ్చ కూరగాయలు, టమాటాలు, రెడ్ బెల్ పెప్పర్, మామిడి, కాంటాలౌప్, గొడ్డు మాంసం కాలెయం, పాలు, చేపలు, గుడ్లు, చేపల నూనెల్లో పుష్కలంగా ఉంటుంది.

మెగ్నీషియం.. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కానీ కొన్ని సీఓపీడి మందులు శరీర సామర్థ్యం పనితీరుకు కూడా సహాయపడతాయి. మెగ్నీషియం మంటను కూడా తగ్గిస్తుంది. ఇది ఉబ్బసం ను తగ్గిస్తుంది. విటమిన్ ఇ.. ఈ విటమిన్ ఇ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఊపిరితిత్తుల కణజాలాల్లో మంటను తగ్గిస్తుంది. ఈ ముఖ్యమైన విటమిన్ ఇ బచ్చలికూర బాదం, అవొకాడోలో పుష్కలంగా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker