Health

లో బీపీ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తినాల్సిన డైట్‌ ఇదే, లేదంటే నీరసంతో..?

హైబీపీ సర్వసాధారణంగా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ లోబీపీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. దీని బాధితుల సంఖ్యా తక్కువగానే ఉంటుంది. మనుషుల్లో సాధారణంగా రక్త పోటు 120/80 ఉండాలి. పరీక్షించిన ప్రతీ సారీ అంతకంటే ఎక్కువ చూపిస్తుంటే దాన్ని హైబీపీ కింద పరిగణిస్తారు. అలాగే 90/60 కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీగా మనం అర్థం చేసుకోవాలి. అయితే సాధారణంగా డాయలిస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg కి పెరగకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే మాత్రం లోబీపీ ఉన్నట్లే.

మనకు లోబీపీ ఉందా లేదా అనేది.. కొన్ని లక్షణాల బట్టి తెలుసుకోవచ్చు. ఉన్నట్టుండి తల తిరగడం, వాంతులు, విరేచనాలు, అసలట, ఒత్తిడి, నీరసం, అలాగే పిరీయడ్స్ టైంలో మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకూ బ్లీడింగ్ అవ్వడం, బీ12 విటమిన్ లోపం, ఇలా రక రకాల సమస్యలు ఎదురవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే.. శరీరంలో సరిపడా రక్తం లేకపోవడం వల్ల లోబీపీ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఇలాంటి లక్షణాలు ఏమీ కనిపించకుండా.. కళ్లు తిరిగి కింద పడిపోతూంటారు.

కాబట్టి ఒక్కోసారి ఆస్పత్రికి వెళ్లి చెక్ చేపించుకోవడం బెటర్. అలాగే మీ ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చడం వల్ల ఈ లోపం నుంచి బయట పడవచ్చు. తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి:- లోబీపీ బాధ పడేవారికి సడన్ గా తల తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు అయితే కింద పడిపోతూ ఉంటారు. బాడీ డీ హైడ్రేషన్ కు గురి కావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది.

హెర్బల్ టీలు:- కొన్ని మూలికా టీలు రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. అయితే రక్త పోటును పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అల్లం లీ లేదా రోజ్మేరీ టీలు తాగితే లోబీపీని కంట్రోల్ చేస్తాయి. ఉప్పునీరు:- లో బీపీతో ఇబ్బంది పడేవారు అప్పుడప్పుడు ఉప్పు నీటిని తాగడం వల్ల బీపీ అనేది తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ టిప్ ని మాత్రం వైద్యున్ని సంప్రదించి సలహా తీసుకుని చేస్తే మంచిది. లేద అనుకుంటే చాలా కొద్ది మొత్తంలో ఉప్పు కలిపిన నీటిని తాగవచ్చు. బీట్ రూట్ జ్యూస్:- బీట్ రూట్ జ్యూస్ లో నైట్రేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను విస్తరించడానికి, రక్త పోటును పెంచడానికి హెల్ప్ చేస్తాయి.

కాఫీ, టీలు తాగినా రక్త పోటును పెంచుతాయి:- కాఫీ, టీలు తాగినా రక్త పోటును పెంచుతాయి. అయితే వీటిని సమపాల్లో తీసుకోవాలి. లేదంటే దుష్ఫ్రభాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు:- సాధారణంగా కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లోబీపీతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నీళ్లు తాగడం శ్రేయస్కరం. ఇవి ఆరోగ్యానికి కూడా పెంపొందిస్తాయి. రక్త పోటును నిర్వహించడానికి హైడ్రేషన్ అవసరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker