కూతురు ప్రేమకు కన్నీరు పెట్టుకున్న తండ్రి, ప్రతి హృదయాన్ని కదిలించే వీడియో.
ప్రపంచం మొత్తం ఎలా కనెక్ట్ అయి ఉందో ఈ మహమ్మారి చూపించింది. ఏదైనా ఒక దేశంలో ఇన్ఫెక్షన్ స్థాయి తీవ్రంగా ఉంటే అది కచ్చితంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ప్రయాణ నిబంధనలు, పరీక్షలు, క్వారంటైన్ లాంటి నిబంధనలు ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే పిల్లలు ఎంత అల్లరిచేస్తారో.. అంతేస్థాయిలో కుటుంబ సభ్యులు బాధలో ఉన్నప్పుడు వారి అద్భుతమైన ప్రేమతో బాధలు మర్చిపోయేలా చేస్తారు.
ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వ్యాపారులు కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమయ్యారు. మనకు కనిపిస్తున్న వీడియోలో రెస్టారెంట్ లో బాధతో తలకిందకు వాల్చి కూర్చున్న తండ్రికి స్వెర్టర్ కప్పి ఆ చిన్నారి నెటిజన్లు హృదయాలను కదిలించింది. వాంగ్.. ఓ రెస్టారెంట్ యజమాని. మహమ్మారి సమయంలో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తేరుకోలేక పోయాడు.
అయినా రెస్టారెంట్ ను ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్నాడు. వాంగ్ తన రెస్టారెంట్ పనిపూర్తిచేసుకున్న తరువాత కొంచెం విరామం తీసుకున్నాడు. తన చేతులను టేబుల్ పై పెట్టి తలను చేతులపై ఆనించి విశ్రాంతి తీసుకున్నాడు. వాంగ్ నిద్రపోతున్న సమయంలో అతని చిన్న కుమార్తె కిచెన్ గదిలోకి వచ్చింది. తండ్రి నిద్రపోతుండటాన్ని చూసి.. నెమ్మదిగా తండ్రి వద్దకు వెళ్లి తండ్రి భుజంపై స్వెర్టర్ కప్పింది.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంచెంసేపటి తరువాత వాంగ్ లేచిచూడగా వీపుపై స్వెర్టర్ ఉంది. తన కూతురు తనకు మరింత ఉపశమనం కలిగించేందుకు స్వెర్టర్ వేసిందని గుర్తించాడు. తన కూతురు చూపిన ప్రేమకు కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.