Health

రోజు 10 నిముషాలు ఇలా చేస్తే మీరు నిండు నూరేళ్ల బ్రతుకుతారు.

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి అన్న తాపత్రయం ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు కావలసిన ఆచరణ ప్రణాళిక ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అని భావించేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయకుండా గంటలకు గంటలు కూర్చున్నా, రోజంతా నిద్రపోయినా అనారోగ్యమే వస్తుంది. మనం తీసుకునే ఆహారానికి, మన శరీరానికి వచ్చే ఎనర్జీకి తగ్గట్టు, ఆ ఎనర్జీ ని ఖర్చు చేయడానికి తగినంత వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం లేకపోతే శరీరం రోగగ్రస్తమవుతుంది. ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే 100 ఏళ్లు జీవించిన వారికి కూడా ఇంకా జీవించాలనే ఉంటుంది.

ఎందుకంటే.. జీవితం అనేది ఒక్కటే. దానికి ఆప్షన్స్ ఉండవు. చనిపోతే.. చాప్టర్ ముగిసినట్లే. అందుకే ఎక్కువ కాలం జీవించడం అనేది అందరి ఆశ. అందుకోసం మనం కొన్ని పాటించాలి. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్, మంచి ఫ్యాట్ ఉండాలి. శరీరంలో విషవ్యర్థాల్ని తరిమేసే బెర్రీస్, ఆకుకూరలు, నట్స్ వంటివి తప్పక తీసుకోవాలి. తద్వారా మీ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజంతా సరిపడా నీరు తాగాల్సిందే. ఎంత తాగాలి అనేందుకు కొలతలేవీ అక్కర్లేదు. దాహం వేసినప్పుడల్లా తప్పక తాగాలి. అలా తాగితేనే స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ బాగుంటుంది. శరీరంలో పనులన్నీ పద్ధతిగా సాగుతాయి. ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి. సన్ స్క్రీన్ రాసుకోవాలి.

తద్వారా హానికరమైన అల్ట్రావయలెట్ (UV rays) కిరణాల నుంచి స్కిన్‌ని కాపాడుకోగలం. UV కిరణాల వల్ల త్వరగా ముసలితనం వస్తుంది, ముడతలు వస్తాయి, చర్మం రంగు మారుతుంది. వర్కవుట్లు, ఎక్సర్‌సైజ్‌లూ చెయ్యాలి. అంత టైమ్ మీకు ఉండకపోతే.. శారీరకమైన ఏవో ఒక పనులు చెయ్యండి. తద్వారా రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఫిట్‌నెస్‌తో ఉంటారు. సరైన బరువు ఉండేలా చేసుకోండి. తద్వారా గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఆందోళన, టెన్షన్, ఒత్తిడి వంటివి త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తాయి. ఇవి బీపీ కూడా వచ్చేందుకు కారణం అవుతాయి. అలా అవ్వకుండా ధ్యానం, యోగా వంటివి చెయ్యండి. మీకు ఆనందం కలిగించే అలవాట్లు పాటించండి.

మీ సెల్ఫ్ కేర్‌పై దృష్టి పెట్టండి. రోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. అంత టైమ్ లేదు అనొద్దు. నిద్రపోయినప్పుడు బాడీ హీటెక్కుతుంది. ఒంట్లో కొవ్వు కరిగిపోతుంది. నిద్రను తగ్గిస్తే.. బరువు పెరుగుతారు. అంతేకాదు.. నిద్రవల్ల బాడీలోని అన్ని కణాలూ రిపేర్ అవుతాయి. నిద్రను తగ్గించడం అంటే.. అనారోగ్యానికి దగ్గరవడమే. ఇది మనం చాలాసార్లు చెప్పుకునేదే. పొగతాగడం, మద్యపానం రెండూ అనారోగ్యకరమే. స్మోకింగ్ వల్ల త్వరగా ముసలితనం వచ్చేస్తుంది. ఆల్కహాల్ కూడా బాడీని డీహైడ్రేట్ చేసి.. చర్మాన్ని నాశనం చేస్తుంది. సమాజంతో ఉండండి. నలుగురితో మాట్లాడండి. ఇష్టమైన వారితో టైమ్ గడపండి. వారితో కలిసి మీకు ఆనందం కలిగించే పనులు చెయ్యండి. తద్వారా మానసికంగా ఆనందంగా ఉంటూ… కణాలు బాగుంటాయి. సవాళ్లు స్వీకరించండి.

పజిల్స్ చెయ్యండి. చదవండి, కొత్తవి నేర్చుకోండి. మ్యూజిక్ పరికరాల్ని వాయించండి… ఇవన్నీ మీ మెదడును చురుగ్గా ఉంచుతాయి. తద్వారా మతిమరపు, ముసలితనపు లక్షణాలు త్వరగా రావు. కొంతమందికి జన్యుపరంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి.. మీ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకొని.. తద్వారా డాక్టర్‌ని కలిసి.. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిదే కదా. మొత్తంగా మనం గ్రహించాల్సింది ఒకటే. వయసు పెరుగుతూనే ఉంటుంది. కాలం గడిచేకొద్దీ.. మనం ఎంతవరకూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అన్నది అసలు విషయం. ఈ టిప్స్ ద్వారా మనం చాలా వరకూ ఆరోగ్యంగా ఉంటామనీ.. త్వరగా ముసలితనం రాకుండా చేసుకోగలం అని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker