Health

ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్, ఎలానో తెలుసా..?

యాపిల్ స్మార్ట్ వాచ్ ఇచ్చిన అలర్ట్ ఓప్రాణాన్ని కాపాడింది. గుండె స్పందనలు అసహజంగా ఉంటే అప్రమత్తం చేసే స్మార్ట్ వాచ్ లు ఎన్నో ఉన్నాయి. యాపిల్ వాచ్ లోనూ ఇలాంటి హెల్త్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. యాపిల్ వాచ్ ఎస్ఈ, వాచ్ 7, వాచ్ 8, వాచ్ 8 అల్ట్రాలో హార్ట్ రేట్ నోటిఫికేషన్ల ఫీచర్లు ఉన్నాయి.

అయితే యూకే చెందిన డేవిడ్ కు అతడి భార్య గిఫ్టుగా ఇచ్చిన స్మార్ట్ వాచ్లో పల్స్ రేట్ 30గా చూపించగా.. వాచ్ పనిచేయడం లేదని అతడు భావించాడు. కానీ భార్య అనుమానించి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. టెస్టులు చేసి గుండెలో పలు బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తే అతను కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చారు.

ఈ క్రమంలోనే అబ్జర్వేషన్ లో డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్ల పాటు అతడి గుండె పనిచేయడం మానేసింది. డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట.. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతడి గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్ స్టార్ట్ చేసిందన్నమాట.. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం.. అతడు ఆరోగ్యంగా ఉండడం చూసి డాక్టర్లు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

చివరకు సర్జరీతో గుండెలోని ఆ బ్లాక్స్ తొలగించి అతడి ప్రాణాలు డాక్టర్లు కాపాడారు. అలాగే భవిష్యత్తులో అతడి హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా గుండెలో ఒక ‘పేస్ మేకర్’ పరికరాన్ని సైతం అమర్చారు.

ఇప్పుడు అతడి గుండె పనితీరు మెరుగుపడింది. ‘నా భార్య నాకు స్మార్ట్ వాచ్ ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు.. నేను బతికి ఉండేవాడిని కాదు.. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క ఛార్జింగ్ సమయంలో తప్ప ఆ వాచ్ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది’ అని డేవిడ్ చెబుతున్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker