Health

ఆ కోరికలు తగ్గినప్పుడు ఈ పండ్లు తింటే చాలు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

లిచీ పండ్ల‌లో ఉండే కాప‌ర్‌.. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. అలాగే ఎర్ర ర‌క్త‌క‌ణాల వృద్ధి కోసం లిచీ పండ్ల‌లో ఉండే కాప‌ర్‌, ఐర‌న్ స‌హాయ‌ప‌డ‌తాయి. ర‌క్తంలోని ద్ర‌వాల‌ను సంతులితం చేయ‌డం ద్వారా హైబీపీని నియంత్రించ‌డంలో లిచీ పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. లిచీ పండ‌ల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. అయితే లిచీలో ఎన్నో మొక్కల ఆధారిత సమ్మేళనాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

లిచీలలో సమృద్ధిగా ఉండే ఎపికాటెచిన్, రుటిన్ అనే మొక్కల భాగాలు ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. లిచీలో ఉండే ఐరన్ జుట్టును ఆరోగ్యంగా పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది..లిచీలను తినడం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే నీటిలో కరిగే విటమిన్.

ఇది హాని సూక్ష్మజీవుల నుంచి మన శరీరాలను కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది..యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల లీచీలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒలిగోనాల్ అనే ఒక భాగం నైట్రిక్ ఆక్సైడ్ (NO) సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. ఇది రక్త నాళాల విస్తరణకు, గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి, మొత్తం గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది..లిచీలో ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి అవసరమైన పొటాషియం, సోడియం సమతుల్య నిష్పత్తి ఉంటుంది.

రక్తపోటును తగ్గించడానికి లిచీ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి లిచీలు ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో ఐరన్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె, ఎముకలకు మేలు చేస్తాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది..ఈ పండులో వాటర్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది..రక్తహీనతను నివారించడంలో లిచీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ పండులో అవసరమైన మొత్తంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. లిబిడోను పెంచుతుంది.. లిచీ పొటాషియం, రాగి, విటమిన్ సితో సహా ముఖ్యమైన పోషకాలకు ప్రసిద్ది చెందింది. ఈ పండును తింటే లైంగికి కోరికలు పెరుగుతాయి. అలాగే లిబిడో కూడా బాగా పెరుగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker