నిమ్మకాయ తొక్కుని ఇలా చేసి వాడితే షుగర్, హార్ట్ ప్రాబ్లమ్ వంటి రోగాలు రానేరావు.
నిమ్మకాయ తొక్కను మాత్ర పడేస్తుంటాం. కానీ దాన్ని విసిరేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయ బహుముఖ ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉంది. రసం నుండి దాని తొక్క వరకు పోషకాలతో నిండి ఉంది. అయితే పుల్లగా ఉండే నిమ్మరసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది నిమ్మకాయ నుంచి రసాన్ని తీసి తొక్కలను మాత్రం డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు.
కానీ నిమ్మతొక్కలు కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. షుగర్ వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి రోగాల ప్రమాదాలాను తగ్గించడానికి దీనిలో ఉండే డీలైమొనేన్ సహాయపడుతుంది. ఈ తొక్క బరువు తగ్గడానికి కూడా సహాయపడతుంది. ఈ తొక్కల్లో ఇందుకు సహాయపడుతుంది. నిమ్మకాయ తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు, నల్లని మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. చర్మం కూడా నిగనిగలాడుతుంది.
ఇకపోతే నిమ్మతొక్కల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మ తొక్కల్లో కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలుంటాయి. నిమ్మ తొక్క నోటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ తొక్కలు రక్తంలో కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. నిమ్మ తొక్కలను వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం సగం నిమ్మ తొక్కను తీసుకుని దానిని బేకింగ్ సోడాలో ముంచండి.
దీంతో గ్యాస్ బండను , స్లాబ్ ను క్లీన్ చేయండి. బేకింగ్ సోడాతో పాటుగా, తొక్కలకు కాస్త వెనిగర్ ను కూడా కలిపి కూడా ఉపయోగించొచ్చు. వర్షాకాలంలో కీటకాలు ఒంటికి ఎక్కువగా అంటుకునే ప్రమాదముంది. అయితే స్నానం చేసేటప్పుడు నిమ్మతొక్కను శరీరానికి రుద్దడం వల్ల శరీరంపై ఉన్న కీటకాలు తొలగిపోతాయి. వంటగదిలో ఏదైనా స్మెల్ వస్తున్నట్టైతే అక్కడ నిమ్మతొక్కలను పెట్టండి. దీంతో చెడు వాసన పోతుంది. నిమ్మతొక్కను గ్రైండ్ చేసి దానికి కొంచెం తేనెను కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం అందంగా మారుతుంది. జిడ్డంతా వదిలిపోతుంది.