పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా..? నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు.
ఎక్కువ సేపు నిల్చోడంతో పాటు గర్భం దాల్చడం, హార్మోన్ల ప్రభావం కూడా రక్తప్రసరణని ఆలస్యమయ్యేలా చేస్తుంది. ఈ సమస్య సాధారణంగా అన్ని భాగాల్లోనూ రావొచ్చు. అయితే, మోకాలి నుండి కింది పాదాలకు వచ్చిన సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అయితే వెరికోజ్ వీన్స్ సమస్యతో బాధపడుతున్నారా ఈ సమస్య నుండి బయట పడాలంటే ఇలా చేయాల్సిందే.
ఇలా చేయడం వలన ఈజీగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నట్లయితే నరాలు పైకి తేలి ఉబ్బుగా కనబడుతుంటాయి. అలానే భరించలేనంత నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పిల్లలు పెద్దలు బిగుతుగా సాక్సులు వేసుకోవడం మంచిది కాదు.
నరాలపై ఒత్తిడి బాగా పడుతుంది ఈ కారణంగా భవిష్యత్తులో ఈ సమస్య కలగొచ్చు. అదేపనిగా కూర్చోవడం వలన కూడా వెరికోస్ వీన్స్ సమస్య వేధిస్తూ ఉంటుంది గంటకొకసారి లేచి వాకింగ్ చేస్తూ ఉండడం మంచిది ఒకవేళ కనుక ఈ సమస్య లక్షణాలు ఉంటే కూర్చునేటప్పుడు నిద్రపోయేటప్పుడు కాళ్ళని కొంచెం ఎత్తుగా పెట్టుకోండి. అలా చేయడం వలన ఉపశమనం కలుగుతుంది.
గంటల కొద్ది నిలుచుని ఉండడం వలన కూడా ఈ సమస్య కలగొచ్చు నిలుచుని పని చేసే వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కూర్చోవడం కొంచెం సేపు నడవడం మంచిది రెగ్యులర్ గా వాకింగ్ చేస్తూ ఉంటే ఈ సమస్య నుండి బయట పడొచ్చు. కాబట్టి ప్రతి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ చేయడం మంచిది మెత్తగా వుండే చెప్పులు వేసుకుంటే ఉపశమనం ఉంటుంది.
గట్టిగా ఉండే చెప్పుల్ని వేసుకోవద్దు. ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడొచ్చు అయితే ఈ సమస్య ఎందుకు వస్తుందని దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు పలు కారణాల వలన వస్తుంది. మోకాలి కింద ఉండే రక్తనాళాలు దెబ్బ తినడం ఎక్కువసేపు నిలబడడం గర్భం దాల్చడం వంటి కారణాలు వలన కూడా రావచ్చు.