ఎడమవైపు తిరిగి నిద్రపోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి.
ఎడమ వైపు నిద్రపోతే మంచిది కాదని కుడివైపు నిద్రపోతే మంచిదని పూర్వీకులు వెల్లడించారు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గురక తగ్గుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్భాశయం, పిండం, మూత్రపిండాలకు అవసరమైన రక్తం అందుతుంది. అయితే మన పూర్వీకులు పెట్టిన నియమాలు, సాంప్రదాయాలు నేటి తరానికి చాదస్తంగా కనిపించవచ్చు.. కానీ ఆ నియమాల్లో శాస్త్రీయ కోణం దాగి ఉందని ఇప్పటికే అనేక విషయాల్లో రుజువైన సంగతి తెలిసిందే. ఇక ఆహారం తినే విషయంలోనే కాదు..శరీరానికి విశ్రాంతినిస్తూ నిద్ర పోయే విషయంలో కూడా మన పెద్దలు కొన్ని నియమాలను పెట్టారు.
తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలని కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలని చెప్పారు.. అంతేకాని.. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని నియమం పెట్టారు. ఇక కుడివైపు నిద్రపోవడం మంచిది కాదని.. ఎడవైపు మాత్రమే నిద్రపోవాలని కూడా చెప్పారు. భోజనం చేసిన అనంతరం జీర్ణం చెయ్యటానికి జఠరాగ్ని యాక్టివేట్ అవుతుంది. మెదట మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది.
అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందువలన నిద్ర వస్తుంది. తగినంత నిద్ర విశ్రాంతి శరీరానికి మంచిది. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలి. ఇక రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన అనంతరం నిద్రపోవాలి.
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పడుకునే విధానం: ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి తలకిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి . ఇలా నిద్రపోవడాన్ని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు. ఎవరైనా అలసటకు గురైనప్పుడు ఇలా ఎడమ వైపున తిరిగి పడుకుంటే అలసట తొలగి పోతుంది. మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు.
ప్రయోజనాలు.. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్బాశయంకు , కడుపులోని పిండానికి, మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది . వీపు , మెడ నొప్పులున్నవారికీ ఉపశమనం ఇస్తుంది. శరీరంలో వున్న విష, వ్యర్ధ పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది . కాలేయం, మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేస్తుంది. ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు.