రోజు ఈ టీ తాగితే ఛాతీలో కఫం మొత్తం బయటకుపోతుంది.
ఛాతీలో కఫం నిండిపోయి ముక్కు మూసుకుపోతుంది. గాలి పైపులో కొంత శ్లేష్మం ఉండటం మంచిదే అయినప్పటికీ, ఇది అధికం కావడం వల్ల సైనస్, అలర్జీలు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే వాతావరణం చల్లబడితే చాలు శ్వాసకోశ సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా కఫం పట్టి ఊపిరి సరిగా ఆడదు. ముక్కు దిబ్బడతో నిద్ర సరిగా పట్టదు. దీనికి కూడా దగ్గు కూడా జత చేరితే ఇక ఇబ్బంది మామూలుగా ఉండదు.
అందులోనూ ఇంకా కరోనా పోలేదు, ఇవి దేనివల్ల వచ్చాయో తెలియక చాలా ఇబ్బంది పడతారు. కఫం వల్ల ముఖంలోని నుదుటి భాగంలో కూడా నొప్పులు రావడం మొదలవుతుంది. లవంగ టీ తయారీ.. లవంగ టీ రోజుకు రెండు సార్లు తాగితే ఇది కఫాన్ని విరిచేస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా లవంగాలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి.రెండు కప్పుల నీళ్లు పోసి, పైన చెప్పిన వన్నీ వేసి మరిగించాలి. బాగా మరిగాక వడకట్టేయాలి.
ఆ నీటిలో అరచెంచా తేనె కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. దీనివల్ల తేనెలోని ఎన్నో సుగణాలు పోతాయి. గోరువెచ్చగా అయ్యాక కలుపుకుని సిప్ చేస్తూ తాగాలి. ఈ మిశ్రమం గొంతులోకి జారుగుతుంటేనే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. అలాగే కఫం పట్టినప్పుడు ఆహారం కూడా ప్రత్యేకంగా తీసుకుంటే మంచిది. కాకరకాయను అధికంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాకర కాయ పులుసు, లేదా వేపుడు రూపంలో తింటే మంచిది. కఫం పట్టిన వేళ మూడు పూటలా కాకరకాయల వంటలు తిన్నా మంచిదే.
ఇలా తినడం వల్ల ఊపిరితిత్తుల్లో,ముక్కులో పట్టిన కఫం అంతా విరిగిపోయి, ముక్కు ద్వారా, నోటి ద్వారా వచ్చేస్తుంది. దగ్గు, జలుబు త్వరగా తగ్గిపోతాయి. ఈ టీలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇతర సమస్యలను ఇది అడ్డుకుంటుంది. సైనస్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ మిశ్రమాన్ని తాగితే ఎంతో మంచిది. శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఈ టీని తరచూ తాగడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గు వంటివి త్వరగా దాడి చేయవు.