రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక్క లవంగం తింటే ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
లవంగాలు చిన్నగా ఉన్నా… వ్యాధుల్ని తరిమికొట్టడంలో, విష పదార్థాల్ని శరీరంలోంచీ బయటకు పంపడంలో బాగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాదు… లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని ఇవి తగ్గిస్తుంది. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి.
అయితే మనం లవంగాలను ఎక్కువగా కూరల్లో వేస్తుంటాం. మాంసం కూరలు, బిర్యానీలలో వీటిని బాగా వాడుతారు. లవంగాలు వేస్తే కూరలకు చక్కని టేస్ట్ వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు.. లవంగాలు మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ ఎంతగానో ఉపయోగపడతాయి.
నోరు బాగా దుర్వాసన వస్తుంటే రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన వెంటనే తగ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. కడుపులో బాగా వికారంగా అనిపించినా, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా.. రెండు, మూడు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది.
రోజుకు ఐదారు లవంగాలను నోట్లో వేసుకుని తింటూ ఉంటే జలుబు, దగ్గు వంటివి వెంటనే తగ్గిపోతాయి. డయాబెటిస్ ఉన్న వారు నిత్యం మూడు పూటలా ఒక లవంగాన్ని తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. లవంగాలను తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా లవంగాలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. లవంగాలు కేన్సర్ అంతు చూస్తాయి కూడా.
కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా లవంగాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు మన ఎముకలకు అవసరం అవుతుంది. బోన్స్ బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది.