రక్త శుభ్రత, రక్త ప్రసరణను మెరుగుపరిచే లవంగ నూనె. ఎలా వాడాలంటే..?
లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు .. విలువైన పోషకాలు ఉన్నాయి. దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీలో శొంఠికి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని వేయించి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణము అవుతుంది. రుచి కోసం కూరలలో వేసుకునే ఈ లవంగాలలో సువాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది దీనిని శాఖాహార, మాంసాహార వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు.
లవంగాల నుండి తయారు చేసే నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రోటీన్స్, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, జింక్, నియాసిన్, ఫొల్లెట్, ఇనుము, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, బి, సి, మరియు ఇ, కె, డిలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లవంగం నూనెలోని క్రిమిసంహారక గుణాలు దంత నొప్పి, పంటి నొప్పి, చిగుళ్లలో పుండ్లు, నోటిపూతలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. లవంగం నూనె బ్రోంకటిస్, జలుబు, సైనసిటిస్ ,ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులకు చికిత్సలో ఉపయోగపడుతుంది.
దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్స్‌పెక్టరెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆవ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజూ ఉదయం లవంగం నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా లవంగం నూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. జీర్ణ సమస్యలకు లవంగం నూనె సహాయపడుతుంది. రోజువారిగా లవంగం నూనె చేర్చుకునే వారు , జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు. లవంగం నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది శ్వాస సమస్యలను నివారించడం తోడ్పడుతుంది.
వేడి నీటిలో కొద్దిగా లవంగం నూనె మిక్స్ చేసి ఆవిరి పట్టడం వల్ల శ్వాస సమస్యల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. లవంగం నూనెలో ఉండే ఆరోమా వాసన మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడితో సతమత మౌతున్న వారు లవంగ నూనె వాసన పీల్చటం ద్వారా బ్రెయిన్ రిలాక్స్ గా మారి ఒత్తిడి తగ్గుతుంది. వికారం, వాంతులను తగ్గించడంలోను బాగా ఉపయోగపడుతుంది. లవంగం నూనెలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యూజినాల్ అనేవి పురుషులని ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కాపాడుతాయి. క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోదించటంలో సమాయపడుతుంది. లవంగ నూనె సువాసన మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.