రోజూ రాత్రి లవంగాలు కలిపిన పాలు తాగితే మీలో ఆ శక్తి భారీగా పెరుగుతుంది.
లవంగాలు చిన్నగా ఉన్నా… వ్యాధుల్ని తరిమికొట్టడంలో, విష పదార్థాల్ని శరీరంలోంచీ బయటకు పంపడంలో బాగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాదు… లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అయితే మీలో చాలా మందికి రోజూ రాత్రివేళలో పాలు తాగే అలవాటు ఉండే ఉంటుంది. ఈ అలవాటు మంచిదే. గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే.. హాయిగా నిద్రపడుతుంది.
పాలల్లో క్యాల్షియంతో పాటు.. శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్పరస్, విటమిన్ డి ఇంకా ఎన్నో పోషకాలున్నాయని తెలిసిన విషయమే. అయితే పాలల్లో.. మార్కెట్లో దొరికే ఏవేవో పొడులు కలిపి తాగుతుంటారు. వాటిలో చాలా వరకూ కలుషితమైనవే ఉంటాయి. కొన్నిపొడుల్లో షుగర్ ఎక్కువగా కలుపుతారు. మరి కొన్ని అయితే.. పల్లీలు, నువ్వుల నుంచి తీసిన వేస్ట్ తో తయారు చేస్తారు. అలాంటివాటిని పాలల్లో కలుపుకుని తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
వాటికి బదులు మన వంటింట్లో ఉండే లవంగాలను పొడిచేసి కలిపి తాగితే ఇంకా మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లవంగాల్లో కూడా క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ వంటి పోషకాలుంటాయి. పాలల్లో లవంగాల పొడిని కలిపి తాగితే.. అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా.. ఈ సీజన్ లో తరచూ జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి అనారోగ్యాలు వస్తుంటాయి.
లవంగాల పాలు తాగితే.. ఇలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయట. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గి.. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగై.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. లవంగాల పొడి కలిపిన పాలు తాగితే.. ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రోగనిరోధకశక్తి పెరిగి.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
నోటి దుర్వాసన, దంతాల నొప్పులు, చిగుళ్లలో వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో రెండు లవంగాల పొడిని కలిపి రోజూ రాత్రి పడుకునే అరగంట ముందు తాగితే.. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు. లేదా ఉదయం పూట కూడా లవంగాల పాలు తాగొచ్చు. 10 ఏళ్ల వయసు దాటిన పిల్లలకు కూడా లవంగాల పొడి కలిపిన పాలను ఇవ్వొచ్చు. ఫలితంగా వారికి తరచూ అనారోగ్యం రాకుండా ఉంటుంది.