ఇలా చేస్తే మీ ఊపిరితిత్తులు బ‌లంగా తయారవుతాయి. ముఖ్యంగా..

ఇలా చేస్తే మీ ఊపిరితిత్తులు బ‌లంగా తయారవుతాయి. ముఖ్యంగా..

ఊపిరితిత్తుల నుంచి ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే ఆక్సిజన్ మీ శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే మీరు ఉబ్బసం, బ్రాంకైటీస్, న్యుమోనియా, క్షయ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవ‌డంలో ఇది మ‌రో చ‌క్క‌టి వ్యాయామం. ఇందులో భాగంగా ముందు నోటిని మూసుకుని ముక్కు ద్వారా బ‌లంగా శ్వాస తీసుకోవాలి. ఆ త‌ర్వాత పీల్చిన గాలిని నెమ్మ‌దిగా నోటి ద్వారా వ‌ద‌లాలి.

ఇలా ఒక రోజులో క‌నీసం 6 నుంచి 7 సార్లు చేయాలి. యోగ ముద్రలో కూర్చొని ఓంకారం ఉచ్ఛ‌రిస్తూ శ్వాస మీద ధ్యాస పెంచే ఈ వ్యాయామం గురించి చాలామందికి తెలుసు. ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవ‌డంలో ఇది పురాత‌నం నుంచి వ‌స్తున్న ఓ చ‌క్క‌టి ప‌ద్ధ‌తి. పొట్ట నుంచి ఓం శ‌బ్దం ఉచ్చ‌రిస్తూ గ‌ట్టిగా శ్వాస తీసుకుని వ‌ద‌ల‌డం ద్వారా ఊపిరితిత్తులు బ‌లంగా త‌యార‌వుతాయి. అయితే ఓంకారం శ‌బ్దం చేసేట‌ప్పుడు దీర్ఘం తీసిన‌ట్టుగా అంటూ శ్వాస తీసుకుని వ‌దిలితే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఊపిరితిత్తులు తొంద‌ర‌గా కోలుకోవ‌డానికి ఎక్కువ‌గా సూచించే ప‌ద్ధ‌తి ఇది. అలా అని దీన్ని నిర్ల‌క్ష్యం చేయొద్దు. బెలూన్ల‌లో గాలి నింప‌డానికి బ‌లంగా ఊదాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల ఊపిరితిత్తులు బ‌లంగా త‌యార‌వుతాయి. ఊపిరితిత్తుల స్థితిని బ‌ట్టి SPO2 లెవ‌ల్స్ ఆధారంగా వాకింగ్ చేయ‌డం దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవాలి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో పార్కులు, బ‌య‌ట‌కు వెళ్లేబ‌దులు ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే వాకింగ్ చేయ‌డం ఉత్త‌మం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *