‘గుంటూరు కారం’ పాట.. కుర్చీ తాతకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసా..?
గుంటూరు కారం నుంచి కుర్చీ మడతపెట్టి పాట ప్రోమో విడుదలైంది. ఈ పాటపై విపరీతమైన ట్రోలింగ్ వస్తోంది. మహేశ్ బాబు వంటి స్టార్ హీరోకు ఇలాంటి బూతు పదంతో పాట కంపోజ్ చేయడమేంటీ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేశ్ బాబు కొత్త సినిమా ‘గుంటూరు కారం’. దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇప్పటికే రెండు పాటలు రాగా అందులో ‘దమ్ మసాలా’ శ్రోతల్ని ఆకట్టుకోగా.. ‘ఓ మై బేబీ’ పాటపై ఓ రేంజులో ట్రోలింగ్ జరిగింది. తాజాగా మాస్ గీతం అని చెప్పి ‘కుర్చీ మడతపెట్టి’ అని సాగే ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
ఇందులో మహేశ్-శ్రీలీల స్టెప్పులు బాగానే వేసినప్పటికీ లిరిక్స్‌పై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కాలా పాషా అనే ఓ తాత.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ ‘కుర్చీ మడతపెట్టి..’ అని బూతు పదంతో కూడిన లైన్ వాడాడు. ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది.
ఇతడు కుర్చీ తాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు మాటల్ని తమన్ పాటగా మార్చేశాడు. అయితే ఇందుకోసం కుర్చీతాతకు దాదాపు రూ.5 వేల ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని స్వయంగా సదరు ముసలాయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ప్రోమోకే ఈ రేంజు ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న ‘గుంటూరు కారం’ టీమ్.. జనవరి 12న సినిమా రిలీజయ్యేలోపే ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఏంటో? మహేశ్-శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాని తల్లి-కొడుకు సెంటిమెంట్ ప్లస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రీసెంట్‌గానే షూటింగ్ పూర్తి చేసుకుంది.