కుమారి ఆంటీ షాప్ దగ్గరకి రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తారో తెలుసా..?
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు పథకంలో మార్పుకు అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే కుమారి ఫుడ్ స్టాల్‌కు పార్కింగ్ సౌకర్యం లేదని.. హైటెక్ సిటీ రూట్‌లో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందన్న కారణంతో కుమారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె దుకాణాన్ని ఖాళీ చేయించారు.
ఇకపై ఫుడ్ స్టాల్ నడపకూడదని ఆదేశాలు జారీచేశారు. పోలీసులు తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడంతో కుమారీ కన్నీటి పర్యంతమయ్యారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దంటూ తన దగ్గరకు భోజనం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ చెబుతూనే ఉన్నానని..ఐనా వినలేదని వాపోయారు.ఇక్కడ తనతో పాటు ఇక్కడ చాలా మంది స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తున్నారని.. కానీ పోలీసులు తన స్టాల్‌ను మాత్రమే క్లోజ్ చేయాలని చెప్పారని తెలిపారు.
తనకు న్యాయం చేయాలని.. ఈ స్టాల్‌పై ఆధారపడి బతుకుతున్నామని కుమారీ ఆంటీ కోరారు. ఆ వీడియోలు కూడా వైరల్ కావడవంతో ఈ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఫుడ్‌స్టాల్‌ను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు అన్ని అనుమతులు ఇవ్వాలని డీజీపీకి సూచించారు. అంతేకాదు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా కుమారి షాప్‌ను సందర్శిస్తారని తెలుస్తోంది. ఆమె ఫుడ్ స్టాల్‌లో సీఎం లంచ్ చేయనున్నారని అధికారులు వెల్లడించారు.