కృష్ణ రెండో పెళ్లి అప్పుడు మొదటి భార్య ఇందిరాదేవి పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా..?
విజయ నిర్మలను కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిరాదేవి ఏం అనలేదు. కృష్ణ తో విడాకులు తీసుకోకుండా పిల్లల బాధ్యతను చూసుకుంది. విజయ నిర్మలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు కృష్ణ. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. తిరుపతిలో శ్రీవారి సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు.
అయితే సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకే సంవత్సరం ముగ్గురు వ్యక్తులు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచి దూరం అయ్యారు. అందులో కృష్ణ కూడా ఉండటం మరో విషాదం. కృష్ణ పెద్దకొడుకు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలుసు కదా. ఆ తర్వాత కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి కూడా మంచాన పడ్డారు. కొడుకు చనిపోయిన కొన్ని రోజులకే ఆమె కూడా మృతి చెందారు. ఇందిరా దేవి చనిపోయిన కొన్ని రోజులకే కృష్ణ కూడా చనిపోయారు.
అయితే.. ఇందిరా దేవి తర్వాత కృష్ణ.. విజయనిర్మలను కూడా చేసుకున్నారు. నిజానికి.. ఇందిరా దేవి ఎవరో కాదు. కృష్ణ మేనకోడలే. తన అక్క కూతురే. అందుకే.. ఇందిరా దేవి అంటే కృష్ణకు ప్రాణం. ఇందిరకు కూడా కృష్ణ అంటే ప్రాణమే. వీళ్లకు ఐదురుగు పిల్లలు జన్మించారు. అందులో మహేశ్ బాబు ఒకరు. ఆ తర్వాత విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినా ఇందిరా దేవి ఏం అనలేదు.
కాకపోతే.. విడాకులు కూడా తీసుకోకుండానే పిల్లల బాధ్యతను నెత్తిమీద వేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో కృష్ణ, విజయనిర్మల జంట స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ అయింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో విజయనిర్మల కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి కృష్ణను పెళ్లి చేసుకుంది. 1969లోనే కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా దేవికి ఈ విషయాన్ని కృష్ణ చెప్పారు. దీంతో ఆమె ఏం మాట్లాడుకుండా సైలెంట్ గా ఉండి కృష్ణ నిర్ణయాన్ని గౌరవించారు. ఆయనకు విడాకులు ఇవ్వలేదు. తన పిల్లలను ఆమె పెంచి పెద్ద చేశారు. అయితే.. విజయనిర్మలతో మాత్రం పిల్లలను కనొద్దని ఇందిరా దేవి కృష్ణకు ఒక్క షరతు మాత్రం పెట్టారట. అందుకే విజయ నిర్మలతో కృష్ణ పిల్లలను కనలేదు అంటుంటారు.