ఈ ఒక్క పండు చాలు, శరీరంలో పెరుకపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కృష్ణ ఫలం యొక్క ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ని ,శరీరం అంతటా కండరాల పనితీరును నియంత్రిస్తుంది. ఇందులో గుండె కండరాలు ఉంటాయి. అదనంగా, దీని పై తొక్క గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం యాంత్రిక యుగంలో ఉన్నాం. ఉదయం పరిగున ప్రజారావాణా ఎక్కిన మొదలు రాత్రి కునుకు తీసే వరకు ఎన్నో పనుల్లోపడి ఆరోగ్యం విషయాన్ని పక్కన పెడుతున్నాం.
ఒంట్లో బలం ఉన్నంత కాలం ఇలా చేయడం బాగానే ఉంటుంది. వయసు మీదపడే కొద్ది ఒక్కో సమస్య పుట్టుకొస్తుంది. ఈ క్రమంలో మనం తినే ఆహారం ముందుగా చేరేది రక్తంలోనే. అలాంటి రక్తాన్ని శుద్ది పరిచేందుకు దోహదపడేది రక్తనాళాలు. ఇవి జల్లెడ లెక్క శరీరంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును ఎప్పటి కప్పుడు తొలగిస్తాయి. అయితే రక్తనాళాల్లో కొవ్వును కరిగించేందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. పెద్ద ఎత్తున వ్యాయామాలుగట్రా చేయనవసరంలేదు. కేవలం ఈ ఒక్క పండును మితంగా తింటే చాలు. మన పని మనం చేసుకున్నట్లే దాని పని అది చేసుకుపోతుంది.
ఈ ఫలం పేరు కృష్ణఫలం. దీనినే ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇవి డ్రైఫ్రూట్ జాతికి చెందినది. ఇందులో గింజలు ఎక్కువగా ఉంటాయి. గుర్తించడం ఎలా అనే సందేహం మీలో కలుగవచ్చు. ఇవి ఊదా, పసుపు రంగుల్లో ఉంటాయి. దీనిని రోజు మితంగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి ఫలం అందుబాటులో ఉంటే.. తొక్క తీసి నేరుగా తినేయవచ్చు. ఏదైనా మితంగా తింటే బాగుంటుంది. ఈ కృష్ణఫలం విషయంలోనూ అంతే. ఇందులో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొంత ఆలోచించి తినడమే మేలు.
అదే మితంగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కృష్ణఫలం ప్రయోజనాలు ఇవే.. ఫైబర్ మన పొట్టకు ప్రీబయోటిక్‌లా వ్యవహరిస్తుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. పొట్ట మంచిగా ఉంటే ఆరోగ్యం మీ గుప్పెట్లో ఉన్నట్లే. శరీరంలోని ఫినాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. తద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా చేస్తుంది.
ఫైబర్ ఎక్కువ కనుక ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది. ఆకలి ఎక్కువ కాదు. తద్వారా అనవసరమైన ఫుడ్ తీసుకోకుండా చేస్తుంది. పైగా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కృష్ణఫలం తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. కావున డయాబెటిస్ బాధితులు కూడా తినొచ్చు. పొటాషియం అపారం. ఇది గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారిస్తాయి. కృష్ణఫలాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఇతర మూలకాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.