కృష్ణ మరణం తర్వాత కుటుంబంలో మొదలైన గొడవలు. దేనికోసమో తెలుసా..?
సూపర్‌స్టార్‌గా.. రంగుల తెరపై రారాజుగా.. సినీ రంగంలో ప్రయోగకర్తగా.. సాహసానికి మారుపేరుగా.. విభిన్న సినిమాల్లో ఘనాపాటిగా.. నటనకే కొత్త భాష్యం చెప్పిన నటశేఖరుడిగా.. మనసున్న మనిషిగా.. ఎందరో అభిమానులకు ఆరుధ్యుడిగా.. నటుడి గా.. నిర్మాతగా.. దర్శకుడిగా.. రాజకీయ వేత్తగా.. బుర్రిపాలెం బుల్లో డైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.. హీరో కృష్ణ జీవిత ప్రస్థానం ముగిసింది.
అయితే కృష్ణ మరణించిన తర్వాత మహేష్ బాబు, నరేష్ మధ్య వారసత్వం కోసం గొడవలు మొదలైనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవికి మహేష్ బాబు జన్మించగా రెండవ భార్య విజయనిర్మలకి నరేష్ జన్మించాడు. అయితే కృష్ణ మరణించిన తర్వాత ఘటమనే నీ కుటుంబానికి వారసుడు ఎవరు అనే విషయంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది.
దీంతో మహేష్ బాబు మాత్రమే ఘట్టమనేని కుటుంబానికి అసలైన వారసుడు అంటూ మహేష్ బాబు అభిమానులు వ్యాఖ్యలు చేయగా ఘట్టమనేని కుటుంబానికి పెద్దదిక్కుగా నరేష్ ఉండగా మహేష్ బాబు ఎలా బాధ్యతలు తీసుకుంటాడు అంటూ నరేష్ అభిమానులు కూడా తీవ్రంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇలా గత కొంతకాలంగా ఘట్టమనేని కుటుంబానికి వారసుడిగా బాధ్యతలు స్వీకరించే విషయం గురించి ఆ కుటుంబంలో గొడవలు మొదలవటమే కాకుండా ఆస్తి విషయంలో కూడా ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్ బాబు ఇప్పటికీ ఆ బాధనుండి బయటపడలేకపోతున్నాడు. దీనికి తోడు ఇంట్లో మొదలైన ఈ గొడవల కారణంగా మహేష్ బాబు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఇటీవల సర్కారు వారి పాట సినిమా ద్వారా హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని రోజులలో ప్రారంభించనున్నట్లు సమాచారం.