డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకోబోయేది ఈ డాక్టరమ్మనే, ఆమె బాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే..?
గమ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన క్రిష్ జాగర్లమూడి ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించాడు. వేదం, కృష్ణం వందే జగద్గురు, గబ్బర్ ఈజ్ బ్యాక్, గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక, మణికర్ణిక, కొండపొలెం, హరిహర వీర మల్లు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం కొండపొలెం 2021లో వచ్చింది. అప్పటి నుంచి ఆయన సినిమాలు రాలేదనే విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాలు క్రిష్ ను కాస్త వెనక్క నెట్టాయి.
కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కాసులు రాలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను కూడా ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం అనుష్కా శెట్టితో కలిసి ఘాటీ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ ఘాటీపై అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. క్రిష్ వ్యక్తిగత జీవితం ఒడిదొడుకులతో కొనసాగుతోంది. 2016లో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఐదేళ్లకే వీరి వివాహ బంధం బీటలు వారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి క్రిష్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు.
అయితే ఇప్పడు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ క్రేజీ డైరెక్టర్ రెడీ అయ్యాడని సమాచారం. హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వైద్యురాలితో క్రిష్ వివాహం జరగనుందని సమాచారం. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం. ఈ క్రమంలోనే క్రిష్ కు కాబోయే భార్యకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వధువు ఆమెనో కాదో తెలియాలంటే మాత్రం పెళ్లి వరకు ఎదురు చూడాల్సిందే.
Director #KrishJagarlamudi will marry Hyderabad-based gynecologist Dr. Priti Challa on November 10.
— 𝖺𝗋𝖾𝗒 𝖣𝗂𝗅𝗅𝗂𝗉𝗎𝗎𝗎 🚶♂️ (@TheDileep7) November 8, 2024
A reception ceremony with family, friends and the film fraternity will follow on November 16. pic.twitter.com/UAFHtOwIKA