డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, ఆ హోటల్‌కు వెళ్లింది నిజమే అంటూ..?
రాడిసన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ..’ రాడిసన్ హోటల్‌కు వెళ్లడం నిజమే .. కానీ సాయంత్రం ఒక అరగంట మాత్రమే నేను అక్కడ ఉన్నా. కేవలం నా ఫ్రెండ్స్‌ను కలవడానికి మాత్రం వెళ్లా. వివేకానందతో కాసేపు మాట్లాడాను.
ఈ విషయం పోలీసులకు కూడా తెలియజేశా. దీనిపై వాళ్లు కూడా నన్ను స్టేట్‌మెంట్ అడిగారు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు నేను హోటల్ నుంచి బయటకు వచ్చేశాను. పోలీసులకు అన్ని వివరాలు వెల్లడించా’ అని అన్నారు. కాగా.. రాడిసన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు నిర్వహించిన దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. డైరెక్టర్ క్రిష్ పేరును ఎనిమిదో నిందితుడిగా చేర్చారు. క్రిష్ పరారీలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.