Health

కొర్రలతో ఇడ్లీ ఇలా తిన్నారంటే..? ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

మిల్లెట్‌లు అనేవి అత్యంత చిన్నని గడ్డిజాతి ధాన్యాలు. ఇవి రుచికరమైనవే కాకుండా, చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి, చెడు కొలెస్ట్రాల్ ఉండదు అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. అయితే చిరుధాన్యాల్లో కొర్రలు ముఖ్యమైనవి. వీటిని తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తారు.

కానీ వీటి రుచి తెల్లని అన్నంతో పోలిస్తే వీటి రుచి అంత టేస్టీగా ఉండదు తెల్ల అన్నంలో సహజంగానే చక్కెర ఉంటుంది అందుకోసమే ఆ అన్నానికి కాస్త రుచి వస్తుంది కొర్రల్లో ఎలాంటి సహజ సంఖ్యలో ఉండవు అందుకే అవి చెప్పగా ఉంటాయి. చిరుధాన్యాలను తినే వారి సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. కొర్రలతో కేవలం అన్నం మాత్రమే వండుకోగలమనుకోకండి. దీంతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. టేస్టీగా ఇడ్లీ ఒకసారి ప్రయత్నించండి. కొర్రలను మిక్సీలో వేసి రవ్వలా మార్చుకోండి.

ఆ రవ్వను మూడు గంటల పాటు నీటిలో నానబెట్టండి. అలాగే మినప్పప్పును కూడా మూడు గంటల పాటు నానబెట్టండి. ఆ తరువాత మిక్సీలో వేసి మినప్పప్పును, కొర్రలను కలిపి పిండిలా రుబ్బుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలో తీసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఆరేడు గంటల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత ఇడ్లీ రేకులకు నూనె రాసి ఈ పిండిని ఇడ్లీల రేకులు వేసుకోండి. అరగంట తర్వాత వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కొబ్బరి చట్నీ, టమోటో చట్నీ, పల్లి చట్నీ… ఏ చట్నీ తో తిన్నా కొర్రలు ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇందులో వెజిటబుల్స్‌ని కూడా కలుపుకోవచ్చు.

పిండిలో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలాంటివి కలిపి కూడా కొర్రలు ఇడ్లీని టేస్టీగా చేసుకోవచ్చు. కొర్రలు రోజూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మహిళలు, పిల్లలు కొర్రలతో చేసిన ఆహారాన్ని తింటే రక్తహీనత సమస్య దూరమైపోతుంది. నిజానికి రక్తహీనత అనేది మహిళలు, పిల్లల్లోనే అధికంగా కనిపిస్తుంది. అలాగే కీళ్లవాతం ఉన్నవారు కూడా కొర్రలతో చేసిన ఆహారాన్ని తినాలి. కాలిన గాయాలు అయినప్పుడు కొర్రల ఆహారాన్ని తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొర్రలు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల ఎక్కువసేపు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. తద్వారా బరువు తగ్గవచ్చు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొర్రలను కచ్చితంగా తినాలి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కొర్రలు ముందుంటాయి. ఇవి మన శరీరానికి బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని ఇస్తాయి. కాబట్టి ఆహారంలో కొర్రలను భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker