ఎంతకీ పిల్లలు పుట్టడం లేదా..? ఈ గుడికి వెళ్తే మీ కోరికలన్నీ తీరి, తొందరలోనే శుభవార్త వింటారు.
400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం.. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. అయితే అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాను.
తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడని చరిత్ర చెబుతుంది. సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా ఆంజనేయుడు కంటపడ్డారు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించారు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీ భేతాళ స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉంది. ఇక్కడికి ప్రతి మంగళ, శని వారాలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. పండగల విశేష సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. అందుకే ఇక్కడ కొలవై ఉన్న ఆంజనేయస్వామిని భక్తులు ప్రేమతో అంజన్న అని పిలుస్తారు.
హైదరాబాదు నుండి 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లడానికి హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ మొక్కు తీర్చుకున్న భక్తులు కొండ కింద నాన్ వెజ్ వంటకాలు వండుకొని తిని వెళ్లడం ఆచారం.