పూజ చేసే సమయంలో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందా..? దానికి సంకేతం ఏంటంటే..?
కొబ్బరికాయలో పువ్వు చాలా మంది దాన్ని కొనుక్కుని తింటూ ఉంటారు. సాధారణంగా ఏ చెట్టుకైనా సరే పువ్వులు పూసి ఆ ప్రదేశంలో కాయలు వస్తాయి. కానీ దీనికి మాత్రం అలా కాదు. కొబ్బరికాయ లోపల ఈ పువ్వులు ఉంటాయి. దీని రుచి బాగుంటుంది. కాబట్టి చాలా మంది ఇష్ట పడుతూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా కొబ్బరికాయను పగులగొట్టినపుడు ఒక్కోసారి అందులో పువ్వు ఆకృతిలో తెల్లని, మెత్తటి పదార్థాన్ని గమనించవచ్చు.
ఇది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా మంది ఇలా రావడం శుభప్రదం అని నమ్ముతారు. అయితే ఇలా వచ్చిన కొబ్బరికాయను ఏం చేయాలి, తినాలా వద్దా అనే సందేహాన్ని మీలో చాలా మంది కలిగి ఉండొచ్చు. కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దానిని వదలకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కొబ్బరిపువ్వులో పోషకాలు దట్టంగా ఉంటాయి, దానిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. కొబ్బరిపువ్వును దానికి వచ్చిన మొలకగా చెప్పవచ్చు.
ఏదైనా కొబ్బరికాయ చాలా ఎక్కువగా పరిపక్వం చెందినపుడు అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది, ఇది మొలకెత్తిన కొబ్బరికాయగా అభివృద్ధి చెందుతుంది. పెంకు లోపల ఉన్న విత్తనం మొలకెత్తిన తర్వాత, అది కొబ్బరి నీటిని గ్రహించి, ఘనమైన స్పాంజ్ లాంటి ద్రవ్యరాశిగా పెరుగుతుంది. దీనిని కొబ్బరిపువ్వు, కొబ్బరి పిండం, కొబ్బరి యాపిల్ అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు.
ఒకవేళ మీ కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. కొబ్బరిపువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీపెరాసిటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. తద్వారా ఇది మీ శరీరంలో అనేక రకాల ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌లు, వ్యాధులకు వ్యతిరేకంగా రోగ నిరోధకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.
మీరు రోగాలబారిన పడకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. సమృద్ధిగా పోషకాలు..కొబ్బరి యాపిల్ అనేక పోషకాలకు గొప్ప మూలం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొలకెత్తిన కొబ్బరికాయలను తినడం వల్ల శరీరానికి పోషణ అంది నిండైన ఆరోగ్యం లభిస్తుంది.