ఉదయాన్నే ఈ పండు తింటే ఎన్ని రోగాలు రావో తెలుసా..?
కీవీ పండు..చూడటానికి సపోట వలె కనిపిస్తుంది కానీ గుడ్డు ఆకారంలో ఉంటుంది. కోసి చూస్తే అనేక గింజలతో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్, పీచు పదార్ధం, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. చాలా మంది దీనిని ‘వండర్ ఫ్రూట్’ అంటారు. అయితే కివీ పండు పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
ముదురు ఆకుపచ్చ రంగులో పుల్లని రుచి, ఈ పండులో పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె ,విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇతర పండ్ల మాదిరిగానే దీనిని జ్యూస్, బ్రట్ సలాడ్, పెరుగు పార్ఫైట్స్, డెజర్ట్ వంటి అనేక రకాలుగా తీసుకోవచ్చు. కివీ పండులో ఆక్టినిడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్.
ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ,జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివీ పండ్లను రోజూ తినడం వల్ల రాత్రిపూట సుఖంగా నిద్రపోవచ్చని మీకు తెలుసా? కివీ పండులోని సెరోటోనిన్ మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. కివీ పండు తినడం వల్ల గాఢ నిద్ర వస్తుంది ,నిద్రలేమికి గ్రేట్ రెమెడీ. ముఖ్యంగా కివీ పండు తొక్కలో ఉండే పోషకాలు సహజ నిద్రకు ఉపకరిస్తాయి ,నిద్రలేని వారికి ఉపశమనం కలిగిస్తాయి.
కివీ పండులోని ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ ఇ ఎముకల నిర్మాణం వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కివీ పండులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలో ఆటోట్రోఫిక్ చర్యను ప్రోత్సహిస్తుంది. దాని పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కివీ పండులో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలను ఆరోగ్యవంతంగా చేస్తుంది. పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. ఎదుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి ఎదిగే పిల్లలకు కివీ పండు ఇవ్వడం చాలా మంచిది.