Kidney Stones: కిడ్నీలో రాళ్ళుని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.? ఈ షాకింగ్ విషయం తెలిస్తే..?

Kidney Stones: కిడ్నీలో రాళ్ళుని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.? ఈ షాకింగ్ విషయం తెలిస్తే..?
Kidney Stones: రాళ్ల సంకేతాలు, లక్షణాలు మీరు మూత్రం పోసే సమయంలో తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, జ్వరం, చలి, ఇన్ఫెక్షన్ తదితర విషయాలను కలిగి ఉంటాయి. కిడ్నీ నొప్పి ఎక్కువగా వెన్ను పైభాగాన్ని ప్రభావితం చేస్తుంది.. ఇది తరచుగా లోతుగా అనిపిస్తుంది. ఇది వెన్నెముక కుడి లేదా ఎడమ చుట్టూ, పక్కటెముక క్రింద, దిగువ వెనుక పొత్తికడుపు ప్రాంతంలో.. సాధారణంగా ఒక వైపున తీవ్రమైన నొప్పి వస్తుంది.. ఇది రెండు వైపులా అరుదుగా సంభవిస్తుంది. అయితే మూత్రంలో రక్తం కూడా రావడం జరుగుతుంది.
Also Read: మునగ ఆకుని ఇలా చేసి తింటే చాలు.
ఇంత ప్రమాదం ఉండే ఈ సమస్య ఎంతో ప్రమాదం కాకపోయినా, సరైన ట్రీట్మెంట్ అనేది ఎంతో అవసరం. ఎప్పుడైతే సరైన ట్రీట్మెంట్ తీసుకోరో అప్పుడు కొన్ని రకాల క్యాన్సర్ అభివృద్ధికి కారణం అవుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా కిడ్నీలో రాళ్లు రావడం వలన విసర్జనలో ఇబ్బంది రావడం లేక మరింత ప్రామాదం అయితే మూత్రంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనబడతాయి. ఇదే విధంగా కొన్ని కొనసాగితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కనుక ఈ ట్రీట్మెంట్ ను సరైన విధంగా తీసుకోవాలి.

తరచుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, బరువు తగ్గడం, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనబడినప్పుడు తప్పకుండా యూరాలజిస్ట్ ను సంప్రదించాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ సమస్య తీవ్రత తగ్గుతుంది. అయితే ఈ సమస్య తగ్గడానికి తప్పకుండా నీరును ఎక్కువగా తీసుకోవాలి. కనీసం ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల వరకు నీరు తాగడం ఎంతో అవసరం. వీలైనంతవరకు రోజువారి ఆహారంలో అధిక ఉప్పు, పంచదార వంటిని తక్కువగా తీసుకోవాలి.
Also Read: ఈ ఆకుకూర తింటే చాలు, శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ భారీగా పెరుగుతుంది.
విటమిన్ సి ఉండేటువంటి నారింజ, నిమ్మకాయలు వంటి పండ్లను తప్పకుండా తినాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఉలవలు, కాకరకాయ, అరటి పండ్లు తీసుకోవడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ప్రమాదాన్ని తగ్గించాలి అంటే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గాలి. ముఖ్యంగా షుగర్, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించుకోవడం వలన కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.