జీవితంలో కిడ్నీ పేషెంట్లు వీటిని అస్సలు తినకూడదు, పొరపాటున తిన్నారో..?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ అత్యంత ముఖ్యమైన అవయవం. కానీ, మారిన జీవనశైలి, చెడు ఆహారపుటలవాట్లు వంటి అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడేవారు విపరీతమైన కడుపునొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. అంతే కాకుండా కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు కొన్ని పండ్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
అయితే రోజు రోజుకు కిడ్నీ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. డయాబెటిస్, అధిక రక్తపోటు, మూత్రం లేదా మూత్రపిండాల్లో రాళ్లు, పెయిన్ కిల్లర్స్ ను వాడటం వంటి ఎన్నో వ్యాధులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మూత్రపిండాల్లోని రాళ్లను కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల వ్యాధులను తగ్గించడానికి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీలైనంత వరకు ఆహారం నుంచి పొటాషియం, భాస్వరం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
ప్రాసెస్ చేసిన మాంసం.. ప్రాసెస్ చేసిన మాంసాన్ని కిడ్నీ పేషెంట్లు అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు. ఊరగాయ..ఊరగాయలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు తినకూడదు.
ఎందుకంటే వీటిలో కూడా సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ రోగులు వీలైనంత వరకు ఆహారం నుంచి ఊరగాయలకు దూరంగా ఉండటం మంచిది. అరటిపండ్లు..అరటిపండ్లు తక్షణ ఎనర్జీని ఇస్తాయి. ఎన్నో రకాల పోషకాలను కూడా అందిస్తాయి. కానీ అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ను ఎక్కువ చేస్తుంది. అందుకే కిడ్నీ పేషెంట్లు అరటిపండ్లకు దూరంగా ఉండాలి. బంగాళాదుంపలు..బంగాళాదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే బంగాళాదుంపల్లో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు బంగాళాదుంపలను తినకూడదు. చక్కెర..చక్కెర ఎక్కువగా ఉండే సోడాలు, కోలాలను మూత్రపిండాల సమస్యలున్నవారు తాగకూడదు. ఎందుకంటే ఇవి కూడా మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.