Health

ఈ అలవాట్లు ఉంటె చనిపోయేవరకు మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటిక‌ప్పుడు మ‌లినాలు తొల‌గిపోవాలి. మ‌లినాలు తొల‌గిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. లేదంటే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే అలాంటి ప‌రిస్థితి త‌లెత్తకూడ‌దంటే కొన్ని ఆహార నియామాలు పాటించాలి. అయితే మీరు జీవిత చరమాంకం వరకూ అంటే వృద్ధాప్యం వరకూ కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే మీ దైనందిక జీవన విధానం మారాల్సి ఉంటుంది.

ఇది పెద్ద కష్టమైంది కాదు. ఇవాళే ఈ మార్పులు చేస్తే చాలు. కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమౌతాయి. నో పెయిన్ కిల్లర్స్ మీరు మీ కిడ్నీల్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే పెయిన్ కిల్లర్ మందుల వాడకం మానేయాలి. దాంతోపాటు ఐబ్రూఫెన్, యాస్పిరిన్, నెప్రోక్సెన్ సోడియం సాల్ట్ వంటి మందుల్ని దూరం పెట్టాలి. ఈ మందులు మీ కిడ్నీలకు హాని కల్గిస్తాయి.

ఫైబర్ ఆహార పదార్ధాలు మీరు మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే..మీ డైట్‌లో కూరలు, పండ్లు, తృణధాన్యాలు చేర్చాల్సి ఉంటుంది. ఈ పదార్ధాలు గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, స్థూలకాయం నుంచి మిమ్మల్ని సంరక్షిస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ వ్యాయామం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. నిర్ణీత పద్ధతిలో క్రమం తప్పకుండా చేసే వ్యాయామం మిమ్మల్ని దీర్ఘకాలిక వ్యాధుల్నించి కాపాడుతుంది. నీళ్లు తాగడం శరీరంలో ఎప్పుడూ తగిన మోతాదులో నీళ్లు ఉండాలి. దీనివల్ల మీరు హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా..శరీరంలోని విషపదార్ధాలు బయటకు తొలగిపోతాయి.

ఈ విష పదార్ధాలు మీ బాడీలో రాళ్లరూపంలో మారవచ్చు. రక్తపోటు, మధుమేహంపై ప్రత్యేక శ్రద్ధ రక్తపోటు, మధుమేహం రెండూ కిడ్నీల్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉన్నా లేదా రక్తపోటు పెరిగినా కిడ్నీ పనితీరుపై ప్రభావం పడుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker