Health

నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలు డామేజ్ అవుతాయా..? అసలు ఏంటో తెలిస్తే..?

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కిడ్నీ పరిశుభ్రత కూడా చాలా అవసరం. దీనిపై ప్రముఖ ఆరోగ్య నిపుణుడు నిఖిల్ వాట్స్ వివరణాత్మక సమాచారాన్ని అందించారు. మూత్రపిండాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా డయాబెటిస్, బిపి వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు వాటిని వడపోయడం కష్టంగా మారుతుంది. దీంతో అవి మామూలుగా పని చేసే దానికంటే అదనంగా పనిచేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలో అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ బాధితులు ఎప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారం మొదలు వైద్య పరీక్షల వరకు దేనిలోనూ కూడా అశ్రద్ధ చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే కిడ్నీలు నిజంగా మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకనే కిడ్నీలుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది.

అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఇవి ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఫిట్ గా ఉండడం.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం చాలా మంచిది. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు. అదే విధంగా బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఇబ్బందులు రావు. కిడ్నీకి కూడా వ్యాయామం చాలా మంచిది. కాబట్టి తప్పకుండా కాస్త సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించండి. సరైన ఆహారం తీసుకోవడం.. మీరు తీసుకునే ఆహారం బట్టి ఆరోగ్యం ఉంటుంది.

కనుక మంచి ఆహార పదార్థాలు తీసుకోండి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం వల్ల ఏ సమస్య రాదు. అదేవిధంగా కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగడం.. కిడ్నీ సమస్యలు ఉంటే నిజంగా ఇబ్బందులు వస్తాయి. నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అతిగా మాత్రం తాగద్దు. రోజుకి మీరు కనీసం ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగినట్టు చూసుకోండి అదే విధంగా యూరిన్ ఎలాంటి కలర్ లేకుండా ఉండేలా చూసుకోండి.

లేదా లైట్ ఎల్లో కలర్ లో వున్నా పరవాలేదు. ఒకవేళ కనుక మీ యూరిన్ ముదురు పసుపు రంగులో ఉంటే మీరు ఇంకా నీళ్లు తాగాలి అని అర్థం. కాబట్టి వీటిని తప్పకుండా చూసుకోండి. రెగ్యులర్ చెకప్.. మీకు ఏమైనా సమస్య వున్నా లేదు అంటే ఇబ్బంది ఉన్నా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి మీ సమస్యను తెలుసుకుని దానికి తగిన పరిష్కారం పొందండి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker