Health

మీరు తరచూ వీటిని తింటే మీ కిడ్నీలు జీవితకాలం ఆరోగ్యంగా ఉంటాయి.

కిడ్నీల పనితీరు మందగిస్తే.. శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీ పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. అయితే కిడ్నీ అనేది శరీరంలో ఒక ముఖ్యమైన అంగం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. విష వ్యర్ధాల్ని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. కిడ్నీ పనితీరులో ఇబ్బంది ఏర్పడితే..ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది.

క్రమంగా క్రానిక్‌గా మారవచ్చు. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీ సమస్య ప్రాణాంతకమౌతుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే నియంత్రించవచ్చు. కొన్ని అలవాట్లతో కిడ్నీను ఆరోగ్యవంతంగా చేయవచ్చు. మీరు వృద్ధాప్యం వరకు మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అందుకోసం కొన్ని ముఖ్యమైన అలవాట్లను అవలంబించడం మంచిది. ఇది కిడ్నీకి సంబంధించిన అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మీ కిడ్నీలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ మందులు తీసుకోవడం మానేయండి. ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్, నాప్రోక్సెన్ సోడియం సాల్ట్ వంటి మందులకు దూరంగా ఉండాలి. ఈ మందులన్నీ మీ కిడ్నీలను దెబ్బతీస్తాయి. మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు చేర్చుకోండి. ఈ పదార్ధాలన్నీ గుండె జబ్బులు, అధిక రక్తపోటు,ఊబకాయం నుండి రక్షిస్తాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

దీంతో పాటు శరీరంలో నీటి పరిమాణం సరిగ్గా ఉండాలి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా మీ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఈ టాక్సిన్స్ మీ శరీరంలో ఉంటే, అవి రాళ్ల రూపంలో ఏర్పడి సమస్యలను కలిగిస్తాయి. అధిక రక్తపోటు, అధిక రక్తంలో చక్కెర స్థాయిలు రెండూ మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినా లేదా రక్తపోటు పెరిగినా, కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.

మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker