News

జబర్ధస్త్ కెవ్వు కార్తీక్ పెళ్లి, అమ్మాయి ఎవరో తెలుసా..?

తాజాగా కెవ్వు కార్తీక్ సైతం పెళ్లి రెడీ అయిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఆమె ముఖం చూపించకుండా.. ” మా జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందని అందరు చెప్తూ ఉంటారు. బహుశా ఆ ఆనందం ఇదేనేమో.. నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థాంక్యూ. కొత్త జీవితాన్ని మొదలుపెడదాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

అయితే జబర్దస్త్‌ ద్వారా పాపులరైన కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే లైఫ్‌ మరింత హ్యాపీగా మారుతుందని కొందరు చెప్పారని…బహుశా అది ఇదేనేమో అంటూ రాసుకొచ్చాడు. నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థ్యాంక్యూ అని.. నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.

తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు కార్తీక్. అయితే ఆ అమ్మాయి ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంచాడు. ఫోటోలో ఆ అమ్మాయి ముఖాన్ని కనిపించనివ్వలేదు. మిమిక్రీ ఆర్టిస్ట్​గా హైదరాబాద్​లో అడుగుపెట్టి.. జబర్దస్త్​లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్​. సాధారణ కంటెస్టెంట్​ నుంచి టీమ్​ లీడర్​గా ఎదిగి.. కెరీర్​లో విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు.

కంటెస్టెంట్​​గా, టీమ్​ లీడర్​గా తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. 2013లో జబర్దస్త్​ ప్రారంభమైన తర్వాత.. తాను 2015 మొదట్లో ఒక సాధారణ కంటెస్ట్​గా అడుగుపెట్టాడు. మొదట ధన్​రాజ్​ టీమ్​లో చేశాడు. ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్​ టీమ్​లో ఆరో కంటెస్ట్​గా కనిపించాడు. 2016లో ముక్కు అవినాశ్​తో టీమ్​ లీడర్​గా అవకాశం వచ్చిన తర్వాతే.. తన కేరీర్​లో చాలా మార్పులు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్​ లీడర్​గా కొనసాగుతున్నాడు. కెవ్వు కార్తీక్‌ది వరంగల్ .

అక్కడే ఇంజినీరింగ్​ పూర్తి చేసి హైదరాబాద్​ వచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్ట్​గా చాలా తక్కువ పేమెంట్స్​కు షోలు చేస్తూ వచ్చాడు. ఆ తరువాత జబర్దస్త్​ ద్వారా అందరు గుర్తుపట్టడం ప్రారంభించారు. 2016లో అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, సింగపూర్​, మలేసియా వంటి చాలా దేశాలు తిరిగాడు. చిరంజీవి , వెంకటేశ్​ వంటి పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడుతూ.. చాలా బాగా చేస్తున్నారంటూ ప్రోత్సహించటం చాలా గొప్ప విషయమని కార్తీక్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker