Health

ఈ కాయలో మీకు తెలియని ఎన్నో రహస్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుసా..?

సాధారణంగా జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉసిరికాయ తినమంటారు. కానీ ఇది కొవ్వు కాలేయాన్ని కూడా ఎదుర్కొంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతూ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనలను రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఉసిరి ఔషధం కంటే తక్కువేమి కాదు.

అయితే మీకు కొండ ఉసిరికాయ తెలుసుకదా… అది పుల్లగా ఉన్నా… దాన్ని తిన్న తర్వాత నీరు తాగితే… ఆ నీరు తియ్యగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పండే విదేశాల్లో ఉంది. దాన్ని మిరాకిల్ ఫ్రూట్, మిరాకిల్ బెర్రీ, మిరాక్యులస్ బెర్రీ, స్వీట్ బెర్రీ అంటారు. సైంటిఫిక్‌గా దాని పేరు సిన్సెపాలమ్ డల్సిఫికమ్. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ పండు చూడటానికి ఈత పండులా ఉంటుంది.

తినడానికి కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఈ పండు తిన్న తర్వాత 30 నిమిషాల పాటూ ఏది తిన్నా… తియ్యగానే ఉంటాయట. చేదు పదార్థం, పుల్లటి పదార్థం తిన్నా సరే… తియ్యగానే ఉంటుంది. అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఈ పండులో గ్లైకోప్రోటీన్ అనే మాలెక్యూల్ ఉంటుంది.

ఈ పండును తిన్నప్పుడు ఈ మాలెక్యూల్.. నాలికపై ఉండే రుచి నాళికలకు అతుక్కుపోతుంది. అందువల్ల మనం పుల్లవి తిన్నా, చేదువి తిన్నా… ఆ రుచి కాకుండా… తియ్యటి రుచే ఉంటుంది. అరగంట తర్వాత ఆ మాలెక్యూల్ వదిలేస్తుంది. మొదట్లో పశ్చిమ ఆఫ్రికాలో కాసిన ఈ పండు… చాలా కాలంపాటూ ప్రపంచానికి తెలియదు. దీన్ని స్థానికంగా యోరుబా ప్రజలు తినేవారు.

18వ శతాబ్దంలో యూరోపియన్ చెవాలియర్… ఈ పండును ప్రపంచానికి పరిచయం చేశారు. లోపల ఒకటే గింజ ఉండే ఈ పండును… 1980 నుంచి అమెరికన్లు వాడటం మొదలుపెట్టారు. ఈ పండు గురించి పెద్దగా ప్రచారం జరగకపోవడంతో చాలా తక్కువ దేశాల్లో ఇది సాగవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker