ఈ కాషాయం తాగితే మీ మూత్రపిండాలు మొత్తం క్లీన్ అవుతాయి.
ఒకొక్క మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో, పిడికిలి ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా, వెన్నుకి ఇటూ అటూ ఉంటాయి. తరచుగా ఎడమ వైపు ఉండే మూత్ర పిండం కుడి పిండానికి ఎదురుగా కాకుండా రెండు సెంటీమీటర్లు ప్రాప్తికి ఎగువకి ఉంటుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఎన్నో మలినాలను, వ్యర్థపదార్థాలను వడపోసి మూత్రపిండాలు బయటకు పంపిస్తాయి.
మూత్రపిండాల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. రోజువారిగా తగినన్ని నీరు శరీరానికి అందించటం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మూత్రపిండాలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అధిక రక్తపోటు వంటి కారణాలతో మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. చివరకు అది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తున్నాయి. కొత్తిమీరలో పొటాషియం, కాల్షియం, ఇనుము, మాంగనీస్, మరియు మెగ్నీషియమం వంటి ఖనిజాల మూలకారకాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు మరియు బీటా-కెరోటిన్ వంటివి కొత్తిమీర ఆకులలో కనిపిస్తాయి.
కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వీటి అవసరత ఉంది. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన సలాడ్, హైపర్టెన్షన్ తో బాధపడుతున్న రోగులు తరచుగా తీసుకోవటం వల్ల రక్తపోటు సమస్య నుండి బయటపడటంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. యుటిఐ లక్షణాలను తగ్గించడంలో కొత్తిమీర ద్వంద్వ ప్రయోజనాలను కలిగిఉంది. ఇది శరీరంలోని వ్యాధికారకాలను బయటకు పంపించడంలో సహాయం చేయడం మాత్రమే కాకుండా మూత్రనాళంలో సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సైతం కొత్తిమీర సహాయపడుతుంది.
మూత్రపిండాలను శుభ్రపరచడంలో కొత్తిమీర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీరు వేడయ్యాక శుభ్రంగా కడిగిన కొత్తిమీరను తరిగి అందులో వేసుకోవాలి. తరువాత ఈ నీటిని బాగా మరిగించి వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున చిన్నగ్లాసు మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూత్రం రంగు మారుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.