కర్పూరాన్ని ఇంట్లో ఇలా చేసి వాడితే అదిరిపోయే ప్రయోజనాలు పొందొచ్చు.
కర్పూరం ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది కాంఫర్ లారెల్ అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆసియా ఖండంలోనూ, ప్రధానంగా బోర్నియో, తైవాన్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. నీటిలో కరగదు. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. తలనొప్పికి.. కర్పూరం చాలా చల్లదనాన్ని ఇస్తుంది.
తలనొప్పి సమస్య ఉంటే, కర్పూరాన్ని అర్జునుడు బెరడు, తెల్ల చందనం, శుంఠి కలిపి రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి వస్తే అర్జునుడి బెరడు, తెల్లచందనం, శుంఠి సమపాళ్లలో కలిపి పేస్టులా చేసి తలకు పట్టిస్తే తలనొప్పి పోతుంది. జుట్టును ఆరోగ్యవంతంగా.. కర్పూరం చుండ్రు, పొడిబారడం, జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు మెరుస్తుంది.
మీకు ఒత్తుగా, పొడవాటి జుట్టు కావాలంటే, కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను అప్లై చేయడం మంచిది. జలుబు నుంచి ఉపశమనం.. జలుబు, ఫ్లూలో కర్పూరం చాలా మేలు చేస్తుంది. జలుబు లేదా దగ్గు ఉన్నట్లయితే కర్పూరాన్ని గోరువెచ్చని ఆవాల నూనెతో కలిపి మర్దన చేయాలి. కర్పూరాన్ని వేడి నీళ్లలో వేసి పీల్చడం వల్ల మూసుకుపోయిన ముక్కు తెరుచుకుని జలుబు, ఫ్లూలో ఉపశమనం లభిస్తుంది. పాదాల నొప్పికి ఉపశమనం.. పాదాల్లో నొప్పి, వాపు సమస్య ఉంటే కర్పూరంలో నూనె కలిపి మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, మీరు కర్పూరాన్ని నువ్వులు లేదా ఆవనూనెతో కలిపి మసాజ్ చేయాలి. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్, ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.