రూ.2 కర్పూరాన్ని ఇలా వాడితే ఎన్ని జబ్బులు తగ్గిపోతాయో తెలుసా..?
కర్పూరంలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. సహజ కర్పూరం శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సహజ కర్పూరం అనేది మన శరీరంలోని చాలా రకాల సమస్యలను ఈజీగా దూరం చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాని సువాసన పరిమళం మనుసుకు మంచి ప్రశాంతతని చేకూరుస్తుంది.
అయితే హిందూ మతంలో కర్పూరాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని ఎక్కువగా దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పూజలో ఉపయోగించే ఈ కర్పూరాన్ని ఔషధంగా కూడా వాడతారు. రెండు రూపాయలకే లభించే ఈ కర్పూరంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా దీనిని ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి వాడతారు. అంతేకాకుండా దీని సువాసన పరిమళం మనుసుకు సాంత్వన చేకూరుస్తుంది. కర్పూరం యెుక్క ఇతర ప్రయోజనాలు.
రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కర్పూరం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై వచ్చే వాపు, మొటిమలు మరియు జిడ్డును కూడా తొలగిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కర్పూరం మిశ్రమాన్ని లేపనంగా వాడతారు. కర్పూరంతో కూడిన బామ్‌ను రాస్తే మెడనొప్పి క్షణాల్లో ఎగురుపోతుంది.
శొంఠి, అర్జున బెరడు, తెల్ల చందనంతో కలిపి కర్పూరం రాసుకుంటే తలనొప్పి దూరమవుతుంది. వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు తగ్గుతుంది. ప్రస్తుత రోజుల్లో జట్టు ఊడిపోతుంది.ఈ సమస్యకు కర్పూరంతో చెక్ పెట్టొచ్చు. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు కొబ్బరినూనెలో కర్పూరం కలిపి రాసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.