News

కర్నూలు జిల్లా రైతుకు వరించిన వజ్రం, ఆ వజ్రం విలువ ఎంతో తెలుసా..?

ప్రతి ఏటా తొలకరి వర్షాలు మొదలైనప్పుడు ఈ వజ్రాల వేట అనేది కొనసాగుతుంది. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వారం రోజులుగా జనాలు వేటను కొనసాగిస్తున్నారు. అయితే ఎవరికీ దక్కని అదృష్టం ఒక రైతును వరించింది. ఆ రైతుకు ఒక వజ్రం దొరికింది. దీంతో అతని దశ తిరిగిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామానికి చెందిన ఓకే రైతు పొలం పనులు చేసుకుంటుండగా ఒక వజ్రం దొరికింది. అయితే పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది. దీంతో అతని జీవితమే మారిపోయింది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రాజు అనే రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దొరికిన వజ్రాన్ని జొన్నగిరి చెందిన వజ్రాల వ్యాపారికి 8 లక్షల 15 వేల రూపాయలు నగదు, 4 తులాల బంగారు ఇచ్చి కొనుగోలు చేశాడు. ఈ ఖరీఫ్ సీజన్‌లో దాదాపుగా 34 వజ్రాలు దొరికినట్లు సమాచారం. గతంలో వర్షాలు సరైన క్రమంలో రాకపోవడంతో వజ్రాలు తక్కువ దొరికేవి. ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు రావడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో చాలా వజ్రాలలు దోరుకుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం వజ్రాల అన్వేషణ కోసం భారీగా జొన్నగిరి పగిడిరాయి, పెరవలి ప్రాంతాలకు తరలివస్తున్నారు.

ఒకసారి తమ అదృష్టం పరీక్షించుకోవడానికి చిన్నాపెద్దా, మహిళలు, ఉద్యోగులు అందరూ వజ్రాల వేట కోసం భారీగా జొన్నగిరికి తరలి వస్తున్నారు. ఏకంగా పత్తికొండ, గుత్తి, ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు లాడ్జిల్లో ఉంటూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వజ్రాలు వెతికి మళ్ళీ సాయంత్రం లాడ్జులకు చేరుకుని బసచేస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ అదృష్టం తమ తలరాతలు మారిపోతాయని అంటున్నారు వజ్రాల అన్వేషకులు.

మరోవైపు, తుగ్గలి, మద్దికేర మండలలోని జొన్నగిరి పగిడిరాయి గొల్లవాని పల్లె అనంతపురం పెరవలి ఈ గ్రామాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుండడంతో వజ్రాల వ్యాపారస్తులు తమ అనుచరులను నియమించుకుని వజ్రాలు దొరికిన వెంటనే తమ దగ్గరికి వచ్చేలా ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే ఇక్కడ దొరికిన వారికి వజ్రం ఎంత విలువ చేస్తోందో అవగాహన లేకపోవడంతో వజ్రాల వ్యాపారస్తులు ఎంత కొంత ముట్టచెప్పి సొమ్మ చేసుకుంటున్నారన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker