News

కంగనను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కి బంపర్ ఆఫర్. ఆఫర్ ఎంతో తెలిస్తే..?

రెండు రోజులక్రితం కంగనా రనౌత్‌పై చంఢీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్‌కు చెందిన కుల్విందర్ కౌర్‌ అనే మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఎన్డీయే కూటమి మీటింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఎయిర్‌పోర్టులో కంగనాకు ఈ ఘటన ఎదురైంది. అయితే అయితే కుల్విందర్ కౌర్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చేయి చేసుకున్నట్లు కుల్విందర్ కౌర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కుల్విందర్ కౌర్ కి మద్దతు పెరిగిపోతుంది. ఇందులో కొంతమంది సినీ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. తాజాగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కి గాయకుడు విశాల్ దద్లానీ మద్దతుగా నిలిచారు. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘ఆమె పై ఏదైనా చర్యలు తీసుకుంటే.. తాను మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని.. నేను హింసను సమర్థించను కానీ.. మహిళా కానిస్టేబుల్ కోపాన్ని అర్థం చేసుకున్నాను.

ఒకవేళ ఆ అమ్మాయిపై ఏ చర్యలు తీసుకున్నా ఉద్యోగం పోయినా.. జాబ్ ఇవ్వడానికి నేను రెడీ. జై హింద్.. జై జవాన్.. జై కిసాన్ ’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. కుల్విందర్ కౌర్ కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రైతుల కష్టాల గురించి దర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడిన కంగనపై తన కోపాన్ని వ్యక్తం చేసింది.

వ్యక్తిగతంగా ఆమెకు కంగనకు ఎలాంటి శత్రుత్వం లేదని అంటున్నారు. ఈ ఘటనపై సరైన విచారణ జరిపించాలంటూ పంజాబ్ డీజీపీ ని కలిసి కోరుతామని రైతు సంఘలా నేతలు సర్వణ్ సింగ్ సందేర్, జగ్దిత్ సింగ్ దల్లేవాల్ మీడియాకు తెలిపారు. ఈ డిమాండ్ తోనే ఆదివారం మొహాలిలోని ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తామని వెల్లడించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker