ఈ కూర తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలన్ని తగ్గిపోతాయి.
బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే… మనం బంతిలా ఉబ్బుతూ ఉంటాం. అదే కందను తింటూ ఉంటే… చెడు కొవ్వు కరిగిపోయి… ఫిట్‌గా తయారవుతాం. కారణం ఇందులోని ఫైబరే. అధిక బరువు తగ్గాలనుకునేవారు వారానికో రెండుసార్లైనా కంద వండుకుంటే మంచిదే. అయితే ముదురు గోధుమ రంగుతో ఈ కూరగాయ ఎన్నో పోషకాలను నింపుకుని ఉంటుంది. కంద యొక్క ఘాటైన రుచి కారణంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చటానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కంద దుంప తీసుకోవడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల మీరు ఫిట్ గా అవ్వొచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్న ఫైబర్ బరువు తగ్గిస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని కందదుంప పెంచుతుంది. అలానే కీళ్ల నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ ప్రక్రియను పునర్నిర్మించడంలో తోడ్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కందను తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైటోన్యూట్రియెంట్లు అనేక ఆరోగ్య సమస్యలను మెరుగుపరచటానికి ఉపకరిస్తాయి. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం మరియు క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఆహారంలో కందను తప్పనిసరిగా చేర్చుకోవాలి. కంద లో ఫైబర్ ఎక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. బాడీ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగనివ్వకుండా ఇది ఉంచుతుంది.
ఇలా ఇది షుగర్ పేషెంట్లుకు సహాయం చేస్తుంది. పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. దీనిని ఆహారంగా తీసుకునే పిల్లలు బలంగా, పొడవుగా పెరుగుతారు. కడుపులో పురుగుల నివారించటలో సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కంద చెక్కు తీసిన తర్వాత బాగా కడగాలి. ముక్కులుగా కోసిన తరువాత వాటిని నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఆ తరువాత, దానిని వివిధ రూపాల్లో ఆహారాలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు.