హీరోయిన్ ఇంట్లో మోగిన పెళ్లి బాజాలు. మరి ఈ భామ పెళ్లి ఎప్పుడో..?
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తమ్ముడు సిద్దార్థ్ వివాహం ఘనంగా జరిగింది. అమెరికన్ పౌరురాలు మెర్లిన్తో అతడు ఏడడుగులు నడిచాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన వీరి పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోదరుడి పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను కల్యాణి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. అయితే అన్నయ్య పెళ్ళిలో పూజా సందడి చేసింది.
తాజాగా మరో హీరోయిన్ అన్నయ్య పెళ్లి జరిగింది. తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. ఆ సినిమాలతో కూడా తెలుగులో బోలెడంత మంది అభిమానులని సంపాదించుకుంది కళ్యాణి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పోస్టులు చేస్తుంది ఈ మలయాళీ భామ.
ఇటీవల తన అన్నయ్య వివాహం జరిగింది. కళ్యాణి ప్రియదర్శన్ అన్నయ్య సిద్దార్థ్ ప్రియదర్శన్ వివాహం మెర్లిన్ అనే అమ్మాయితో ఘనంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఫిబ్రవరి 3న జరిగింది. చాలా తక్కువమంది మధ్యలో ఈ వివాహం చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వివాహం జరిగినట్టు సమాచారం.
ఇక కళ్యాణి నాన్న ప్రియదర్శన్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని తెలిసిందే. అయినా కళ్యాణి అన్నయ్య పెళ్ళికి సినీ పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది హాజరయ్యారు. కళ్యాణి అన్నయ్య సిద్దార్థ్ వివాహంలో ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణి తన ఫ్యామిలీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పింది.
దీంతో అన్నయ్య పెళ్లి అయిపొయింది మరి నువ్వెప్పుడూ చేసుకుంటావు అని కళ్యాణిని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు.
Last evening we celebrated my brother’s marriage in the most special and intimate ceremony at home with just family. Im so excited to have Melanie be the sister I’ve always wanted ♥️. Hope we all have your blessings 🙏🏻 pic.twitter.com/6fhIDYFqJ1
— Kalyani Priyadarshan (@kalyanipriyan) February 4, 2023