ఖాళీ కడుపుతో ఈ కలోంజీ వాటర్ తాగితే చాలు, మీకు ఎలాంటి రోగాలు రావు.
ప్రతిరోజూ ఉదయాన్నే నల్ల జీలకర్ర వాటర్‌ను తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. కలోంజీ వాటర్ రోజూ తీసుకుంటే బరువు తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మలినాలు, కొవ్వు పేరుకుపోవడాన్ని నియంత్రిస్తూ ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూస్తాయి. కలోంజీ విత్తనాలు ఆకలిని తగ్గించి, ఆరోగ్యకర కొవ్వులు కోల్పోకుండా నియంత్రించడం ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
అయితే అధిక బరువుతో బాధపడే వారు ఈ కలోంజి గింజలను వాడడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా రెండు వారాల పాటు తాగడం వల్ల క్రమంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అంతేకాకుండా మనకు మార్కెట్ లో కలోంజి విత్తనాలు క్యాప్సుల్స్ రూపంలో కూడా లభ్యమవుతూ ఉంటాయి.
వీటిని ఉపయోగించినా కూడా మనం బరువు తగ్గవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు ఈ కలోంజి క్యాప్సుల్స్ ను రోజుకు రెండు చొప్పున గోరు వెచ్చని నీటితో తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి సులభంగా విముక్తి పొందవచ్చు. ఇలా కలోంజి నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల లేదా కలోంజి క్యాప్సుల్స్ ను వాడడం వల్ల బరువు తగ్గడంతోపాటు మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ కలోంజి నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావల్సినంత శక్తి లభించి నీరసం, అలసట తగ్గు ముఖం పడతాయి. అధిక రక్తపోటుతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. కలోంజి నీటిని తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.
నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా కలోంజి విత్తనాలను వాడడం వల్ల బరువు తగ్గడంతోపాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.