తరచుగా కళ్లు తిరుగుతున్నాయా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?
శరీరం మొత్తం కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు చుట్టుపక్కల మొత్తం తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. దీనికి చెవి సమస్యే కారణం. అంటే చెవి లోపలికి కాల్షియం కార్బోనేట్ పార్టికల్స్ వెళతాయి. వీటివల్లే కళ్లు తిరుగుతాయి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఎంత ప్రమాదమో, తగ్గినా కూడా అంతే ప్రమాదం. ఎవరైనా కళ్లు తిరిగి పడిపోయినప్పుడు ఎక్కువ మంది చూసేది రక్తపోటు. రక్తపోటు తగ్గిందేమో, లేక అధికంగా పెరిగిందేమో అనుకుంటారు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండడాన్ని ‘తక్కువ బ్లడ్ షుగర్ లేదా హైపోగ్లైసీమియా’ అంటారు. ఇది ప్రధానంగా మధుమేహం ఉన్నవారిలోనే కనిపిస్తుంది. డయాబెటిస్ లేని వారిలో ఈ సమస్య కలగడం చాలా అరుదు. డయాబెటిస్ ఉన్న వారిలో హఠాత్తుగా రక్తంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయిలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. భోజనం తినకుండా ఎక్కువ కాలం పాటూ ఖాళీ పొట్టతో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అల్పాహారం దాటవేయడం, మధ్యాహ్నం భోజనం దాటవేయడం వంటివి చేయకూడదు.
ఇన్సులిన్ అధికంగా తీసుకున్నా లేక హెపటైటిస్ సి వ్యాధి కోసం వాడే యాంటీ వైరల్ మందుల వల్ల కూడా ఇలా జరగవచ్చు. బంగాళాదుంపలు, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం తగ్గించాలి. వ్యాయామాలు చేయడం మంచిదే, కానీ తీవ్రమైన వ్యాయామాలు చేయడం వల్ల ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. ఆల్కహాల్ అతిగా తాగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కిడ్నీ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా జరుగుతుంది. తగినంత నీరు తాగకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి.
క్షయ, క్యాన్సర్, కాలేయ సమస్యలు ఉన్న వారిలో కూడా జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గగానే ఒళ్లంతా అకారణంగా చెమటలు పడతాయి. తీవ్ర అలసటగా అనిపిస్తుంది, తల తిరుగుతుంది. వికారంగా అనిపిస్తుంది. విపరీతమైన ఆకలి వేస్తుంది. పెదవుల్లో వణుకు కనిపిస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఏడుపు త్వరగా వచ్చేస్తుంది. ఆత్రుత పెరుగుతుంది. చర్మం రంగు మారుతుంది. చూపు మసకబారుతుంది. మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది.