అప్పుడప్పుడు కళ్లు తిరుగుతున్నాయా..? ఈ రోగాలు ఉండొచ్చు, జాగర్త.
కళ్లు తిరగడానికి కారణాలేన్నో ఉంటాయి. బీపీ తక్కువ కావడం, ఒత్తిడి ఎక్కువ అవడం వంటి ఎన్నో కారణాల వల్ల కళ్లు తిరుగుతాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా కళ్లు తిరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది కళ్లు తిరగడం విర్టిగో ఒకటే అనుకుంటారు. ఒకేలాగ అనిపించినా ఇవి రెండు కొన్ని తేడాలు ఉంటాయి. కొంత మందిలో కళ్లు తిరుగుతున్నపుడు గందరగోళానికి లోనవుతారు. వెర్టిగోలో మనం ప్రమేయం లేకుండా కదిలిపోతున్న భావన కలిగిస్తుంది. విర్టిగోలో చుట్టు ఉన్న పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తాయి.
విర్టిగో లోపలి చెవిలో సమస్యల వల్ల వస్తుంది. లోపలి చెవిలో కాల్షియం కార్బేనేట్ పార్టికల్స్ చేరినపుడు ఈ రకమై సమస్య వస్తుంది. దీనిని బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ విర్టిగో అంటారు. చెవిలో చేరిన కాల్షియం కార్బోనేట్ పార్టికల్స్ మెదడు సమాచారం సేకరించడంలో ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల కళ్లు తిరుగుతాయ. మైగ్రేన్.. మైగ్రేన్ వల్ల కూడా కొందరిలో తల నొప్పితో పాటు కళ్లు తిరగడం, వికారం, వాంతులు కావడం వంటి సమస్యలు ఉంటాయి. మరి కొంత మందిలో మైగ్రేన్ రావడానికి ముందే ఒక సూచనగా కళ్లు తిరుగుతాయి. లో బీపి.. ఒక్కసారిగా బీపీ స్థాయిలు పడిపోవడం వల్ల కూడా కళ్లు తిరుగుతాయి.
ఇలాంటి మార్పులు అకస్మాత్తుగా నిలబడడం, లేదా కూర్చోవడం, లేదా వెనక్కి పైకి తల తిప్పడం చేస్తే జరగవచ్చు. కొంత మందిలో డీహైడ్రేషన్, గాయపడి రక్తం పోవడం, ఎలర్జిక్ రియాక్షన్ల వల్ల, ప్రెగ్నెన్సీ వల్ల కూడా బీపీ పడిపోయి కళ్లు తిరగవచ్చు. కార్డియో వాస్కులార్ డిసీజ్.. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల హార్ట్ ఫేయిల్యూర్ కు కారణం కావచ్చు. దీనికి ముందు కళ్లు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు. హార్ట్ ఎటాక్ కు ముందు కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్బాలలో గుండె లయ తప్పడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో అసౌకర్యం, ఆగకుండా దగ్గు రావడం, నీరసం, కాళ్లు, చేతుల్లో నీరు చేరడం, వికారం, వాంతులు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.
రక్త హీనత.. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అందువల్ల బ్రెయిన్ కు సరిపడినంత ఆక్సిజన్ అందక పోవడం వల్ల కళ్లు తిరుగుతాయి. కళ్లు తిరగడం మాత్రమేకాదు, ఆయాసంగా ఉండడం, ఛాతిలో నొప్పి, నీరసం కూడా అనిపిస్తుంది. హైపోగ్లైసిమియా (లో బ్లడ్ షుగర్).. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే తక్కువ నమోదు అయినపుడు కళ్లు తిరగవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల వల్ల, హర్మోనల్ సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒత్తిడి.. ఒత్తిడి దీర్ఘకాలంగా కొనసాగుతున్నపుడు కూడా కళ్లు తిరిగే సమస్య వస్తుంది.
ఇందుకు డిప్రెషన్, యాంగ్జైటీ, గుండె సమస్యలు, డయాబెటిస్ లేదా ఇతర రోగ నిరోధక కారణాలు కారణం కావచ్చు. ఇలాంటపుడు చెమటలు పట్టడం, శరీరంలో వణుకు, తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె దడ, నిద్ర సరిగ ఉండక పోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? కళ్లు తిరగడం సాధారణ అనారోగ్యమే. చాలా సార్లు దానంతంట అదే తగ్గిపోతుంది కూడా. కానీ ఒక వస్తువు రెండుగా కనిపిస్తున్నపుడు, వాంతులు, జ్వరం, తిమ్మిర్లు, కదలడానికి ఇబ్బంది లేదా శరీరం స్వాధీనం తప్పిన, తలనొప్పి, ఛాతిలోనొప్పి, స్పృహతప్పితే తప్పనిసరిగా డాక్టర్ ను కలిసి సరైన చికిత్స తీసుకోవడం అవసరం.