కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగుతున్నారా? ఇది చూస్తే జన్మలో తాగరు, వైరల్ వీడియో
అతిగా కూల్ డ్రింక్స్ తాగటం వలన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు లేదా సోడా డ్రింక్స్ వంటి స్వీట్ టేస్ట్ పానీయాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు. కూల్ డ్రింక్స్ తాగి సంతృప్తి చెందినప్పటికీ ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధులను పెంచుతాయి. ఇటువంటి పానీయాలను సేవిస్తే మహిళలకు మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు. అయితే ఏది కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఏం తాగేటట్టు లేదు ఏది అసలు? ఏది నకిలీ ? పసిగట్టలేనంతగా మార్కెట్‌లో కల్తీ సరుకు డంప్ అవుతోంది.
బ్రాండెడ్ కంపనీ ప్రాడక్ట్స్‌ను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఒరిజినల్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా మాయ చేస్తున్నారు. పేరుకు బ్రాండెడ్ బాటిలే.. కానీ అందులో నింపింది కల్తీ మాల్. నిబంధనల్లేవు… నీళ్లు లేవు.. డ్రైనేజీ కన్నా అపరిశుభ్రంగా వున్న ఏరియాలో కూల్ డ్రింక్స్ తయారీ చేస్తున్న వైనం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అవును.. అపరిశుభ్ర వాతావరణం మధ్యే కూల్ డ్రింక్స్ ఫిల్లింగ్ జరుగుతోంది. పది రూపాయలు తక్కువకు వస్తుంది అంటే చిరు వ్యాపారులు వాళ్ల దగ్గరే కొంటారు కాబట్టి..
అలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని ఈ దందా సాగిస్తున్నారని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ప్రజంట్ సమ్మర్ సీజన్ నడుస్తోంది. కూల్ డ్రింక్స్ సేల్ విపరీతంగా నడుస్తుంది. మండే ఎండల్లో కూల్ కూల్‌గా ఓ డ్రింక్ తాగుదాం అనుకునే ముందు అది ఒరిజినలా, కల్తీనా అని ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ఓ కంపెనీ కూల్‌డ్రింక్స్ బాటిళ్లకు డ్రింక్‌ను నింపుతున్నాడు. మరో వ్యక్తి దానికి ఒరిజినల్ లేబుల్స్ వేసి సీల్ వేస్తున్నాడు. చూడటానికి అచ్చం కంపెనీ కూల్ డ్రింక్‌లా ఉండేలా తయార చేస్తున్నారు.
ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు ఏంట్రా బాబు ఈ దరిద్రం అంటూ మండిపడుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇది మన దేశంలో కాదని ఇంకొందరు పేర్కొంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతోన్న ఇలాంటి వాళ్లపై .. చర్యలు తీసుకోవాలని నెటజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Scaryyyy…
— Vineeth K (@DealsDhamaka) March 29, 2024
Everything in this world is fabricated or adulterated these days …
pic.twitter.com/XuZ25avksj