ప్రతి రోజు ఉదయాన్నే కలబంద రసం తాగితే నాజూకైన శరీరాకృతి మీ సొంతం అవుతుంది.
పెరుగుతున్న శరీర బరువును తగ్గించడంలో కలబంద దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చర్మాన్ని తేమగా ఉంచడం నుంచి చుండ్రు చికిత్స వరకు కలబంద గొప్ప రెమెడీగా పనిచేస్తుంది. కానీ కలబందను తినవచ్చని చాలా మందికి తెలియదు.
అలోవెరా జెల్ జ్యూస్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. కలబందలో అలోయిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కేలరీలను కూడా కరిగిస్తుంది. అలోవెరా ఈ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సరైన ఆహారం, వ్యాయామం రెండూ ముఖ్యమైనవి. కలబంద తీసుకోవడం వల్ల కేలరీలు చాలా సులభంగా బర్న్ అవుతాయి.
కానీ సరైన పద్ధతిలో తీసుకోవడం తెలియకపోతే కలబందను వినియోగించడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగాలి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల కలబంద రసం, ఉసిరి రసాన్ని కలుపుకుని, ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తాగాలి. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా కలబంద రసాన్ని కలుపుకుని, ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగాలి.
కలబంద రసం తీసుకోవడానికి ఇది ఉత్తమ మార్గం. ఈ విధంగా కలబంద జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం అన్నం తినడానికి 30 నిమిషాల ముందు కలబంద రసం తాగాలి. కలబంద రసంతో తాగాలి. ఇది జీవక్రియను పెంచుతుంది. త్వరగా బరువు తగ్గవచ్చు. చాలా మంది అలోవెరా జ్యూస్ తాగడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు కలబంద రసంలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి తాగాలి.
ఇలా చేస్తే అలోవెరా జ్యూస్ మరింత రుచిగా ఉంటుంది. తేనె కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కలబంద రసాన్ని నిమ్మరసంలో కలిపి కూడా తాగవచ్చు. లావు తగ్గాలంటే కలబంద రసాన్ని ఈ విధంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.