షుగర్, బీపీ, ఊబకాయ సమస్యలున్నవారు ఈ టీ తాగితే మంచి పలితాలు ఉంటాయి.
కాకరకాయ తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇలా టీగా తాగలేమూ అనుకునే వాళ్లు.. జ్యూస్‌గా కూడా చేసుకుని తాగొచ్చు. ఇది ఇంకా తక్కువ ప్రాసెస్. కాకరకాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మొదట ఒకసారి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత నీళ్లు పోయండి. ఒక కప్పు కాకరకాయకు ఒక కప్పు నీళ్లు..పరిమాణంలో తీసుుకోండి. మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకుని అందులో నిమ్మరసం వేసుకుని తాగండి. అయితే డయాబెటిస్ ను తగ్గించడం కోసం.. ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి.
అంతెందుకు మన వంటింట్లోనే షుగర్ వ్యాధిని తగ్గించే ఎన్నో ఔషధాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. అందులో ఒకటే కాకరకాయ టీ. అవును.. కాకరకాయను కూర వండుకొని తింటారు కానీ.. ఇలా టీ కూడా చేసుకొని తాగుతారా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. కాకరకాయతో జ్యూస్ చేయొచ్చు.. కాకరకాయతో టీ కూడా చేయొచ్చు. కాకరకాయతో చేసిన టీని తాగితే.. మీరు వద్దన్నా కూడా షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. కాకరకాయ టీని చాలా సులభంగా తయారు చేయొచ్చు.
ముందు.. కాకరకాయలను తీసుకొని.. వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఆ ముక్కలను ఎండలో ఎండబెట్టండి. ఆ తర్వాత ఆ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని.. కొన్ని నీళ్లు పోసి.. దాన్ని బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టండి. వడకట్టిన తర్వాత వచ్చిన నీటిలో కాసింత తేనె, నిమ్మరసం కలిపేయండి. అదే కాకరకాయ టీ. దాన్ని రోజు రెండు సార్లు.. ఒక్కో కప్పు చొప్పున తాగండి. దీని వల్ల రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
కాకరకాయ టీ వల్ల.. కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ లో ఉంచుకోవడం కాదు.. దాని వల్ల క్యాన్సర్ కణాలు కూడా నాశనం అవుతాయి. దీని వల్ల.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పుతుంది. అలాగే.. శరీరంలోని విష పదార్థాలను కాకరకాయ టీ బయటికి పంపిస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్లు కూడా కాకరకాయ టీని తాగితే.. బరువు తగ్గుతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.