Life Style

మంచిదని కాకరకాయ కూరని ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..?

కాకరలో నీరు తక్కువ గా ఉండి పౌష్టికత అధికంగా ఉంటుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ. థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. అందుకే కాకరను తరచూ తినమని సూచిస్తుంటారు. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే గర్భీణీ స్త్రీలు దీనిని వాడకపోవటమే మంచిది. చిన్నారులకు కూడా పెట్టకపోవటమే మేలు. ఎందుకంటే ఇందులో వీటి గింజల్లో చిన్నారులకు హానికలిగించే విషపదార్ధం ఉంటుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో బాగా ఉపకరిస్తుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.

అయితే చాలా మంది కాకరకాయ వలన చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని అతిగా తీసుకుంటూ ఉంటారు నిజానికి ఏ ఆహార పదార్థాలను అయినా సరే లిమిట్ గా తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా తీసుకోవడం వలన సమస్యలు కలుగుతాయి. కాకరకాయను కూడా లిమిట్ గానే తీసుకోవాలి కాకరకాయని అతిగా తీసుకుంటే పలు రకాల సమస్యలు తప్పవు.

వాంతులు అవ్వచ్చు.. కాకరకాయని అతిగా తీసుకుంటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. గర్భిణీలకు మంచిది కాదు.. గర్భిణీలకి కాకరకాయ అసలు మంచిది కాదు తక్కువ మోతలో కూడా తీసుకోకూడదు. లివర్ సమస్యలు.. కాకరకాయని తీసుకోవడం వలన లివర్ సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. కిడ్నీ సమస్యలు వస్తాయి.. కిడ్నీ సమస్యలు కూడా కాకరకాయని అతిగా తీసుకోవడం వలన వచ్చే ప్రమాదం కాబట్టి కాకరకాయని అతిగా తీసుకోవద్దు.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు.. కాకరకాయని అతిగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.. కొంతమందికి కాకరకాయ పడుతూ కాకరకాయను తీసుకుంటే ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. పాలిచ్చే తలలకి మంచిది కాదు.. కాకరకాయ పాలు ఇచ్చే తల్లులకు అస్సలు మంచిది కాదు. కాబట్టి తీసుకోకుండా వుండండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker