ఓ అభిమాని కాజల్ సెల్ఫీ కోసం వచ్చి అక్కడ చేతులేసిన కుర్రాడు, వైరల్ అవుతున్న వీడియో.
కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కల్యాణం’ అనే సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ లేడీ.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టి కాజల్ కొన్ని చిత్రాల్లో నటించింది. తద్వారా నేషనల్ లెవెల్‌లో నేమ్, ఫేమ్ దక్కించుకుంది. అయితే చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తుంది.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ కరోనా సమయంలో పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల మళ్ళీ తమిళ్, తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. త్వరలో సత్యభామ, ఇండియన్ 2 సినిమాలతో అభిమానులని పలకరించనుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది కాజల్. షాప్ ఓపెనింగ్స్ లో కూడా పాల్గొంటుంది.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
తాజాగా హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది కాజల్ అగర్వాల్. కాజల్ ని చూడటానికి అనేకమంది అభిమానులు అక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భంలో అనుకోని ఘటన జరిగింది. ఓ వ్యక్తి అభిమాని అంటూ సెల్ఫీ తీసుకుంటానని దగ్గరికి వచ్చి కాజల్ నడుము మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాజల్ వెంటనే సీరియస్ అవ్వగా అక్కడ ఉన్న బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకి లాగేసారు.
మరిన్ని వార్తల కోసం www.manaarogyamkosam.com క్లిక్ చేయండి.
ఈ సంఘటనతో కాజల్ షాక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అభిమాని అని చెప్పి హీరోయిన్ తో ఇలా మిస్ బిహేవ్ చేయడమేంటి అంటూ నెటిజన్లు ఆ వ్యక్తిపై సీరియస్ అవుతున్నారు.
Orey 😳😳😳😳😳
— GetsCinema (@GetsCinema) March 6, 2024
https://t.co/XQ7yRcUGDX