Health

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

ఉసిరికాయ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేసి.. ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. దీనివల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది.ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది.ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అందరిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పూర్వం రోజుల్లో వందేళ్లకు కాని రాని జబ్బులు ఇప్పుడు ఇరవై ఏళ్లకే పలకరిస్తున్నాయి.

చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలను తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మందులు వాడుతూ నిత్యం వాటితోనే సహజీవనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రతి వారిలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. బాగా లావు ఉన్న వారికే కొవ్వు ఉంటుందని అనుకునే వాళ్లం. కానీ సన్నగా ఉన్న వారికి సైతం కొవ్వు సమస్య వస్తోంది. దీంతో వారు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైద్యులను సంప్రదిస్తూ లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్నారు. కొవ్వును తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి.

ఇందులో ఉసిరి అర్జున జ్యూస్ ఒకటి. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఉసిరి కాయలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి. దాని నుంచి రసం తీయాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే అర్జున చెట్టు బెరడు ముక్కను అందులో వేసి మరిగించాలి. ఆ నీళ్లు చల్లారాక వడకట్టుకుని ఒక బాటిల్ లో ఆ నీటిని పోయాలి. ఆ బాటిల్ లో ముందుగా తీసుకున్న ఉసిరి రసాన్ని పోయాలి. ఇప్పుడు మందు తయారవుతుంది. తాగే ముందు తేనె కలుపుని తాగాలి.

దీంతో అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటి, మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ జ్యూస్ తక్కువ టైంలోనే మన చర్మానికి రంగు వచ్చేలా చేస్తుంది. చర్మాన్ని శుభ్ర పరచి మెరుపు రావడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ఉసిరి వల్ల మనకు ఎన్నో లాభాలు దాగి ఉన్నాయని తెలుసుకున్నాం. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో విలువ ఉంటుంది. ఉసిరితో మనకు ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా మేలు కలుగుతుంది.

ఉసిరితో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిదే. ఆరోగ్య పరిరక్షణలో ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి గాను మనం చేయాల్సిందల్లా దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడమే. మన దేహాన్ని రోగాల బారి నుంచి రక్షించుకోవాలంటే ఉసిరి మనకు ఎంతో మంచిదని తెలుసుకుని వాడుకోవడం శ్రేయస్కరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker