చిన్న యాడ్ ఫిల్మ్ కి ఎన్టీఆర్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?
తారక్ ప్రస్తుతం భవిష్యత్తు మూడు ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది.ఈ రీజన్ వల్లే ప్రాజెక్ట్ లు లేట్ అవుతున్నా తారక్ మాత్రం తొందరపడకుండా కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు క్లాథింగ్, మార్కెటింగ్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్లలో నటిస్తున్నారు. ఇటీవల రెండు యాడ్ షూట్లలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
అందులో ఒకటి రీసెంట్ విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్ కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన లైషియస్ కోసం యాడ్ షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, రాహుల్ రామక్రిష్ణ తో కోర్టు లో చేసిన సీన్ ఆకట్టుకుంటోంది. స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు మురిసిపోతున్నారు.
అప్ కమింగ్ ఫి ల్మ్స్ ఆలస్యం అవుతుండటంతో.. కనీసం ఇలానైనా ఎన్టీఆర్ దర్శనం కలగడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ 30’ షూటింగ్ కు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ ఇలా యాడ్ షూట్ లో దర్శనమిస్తున్నారు. అయితే, ఇందుకు తారక్ భారీగానే ఛార్గ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లైషియస్ బ్రాండ్ యాడ్ షూట్ కోసం రూ.3.50 కోట్ల వరకు తీసుకున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 31’లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది.