జియో యూజర్లకు గుడ్ న్యూస్, ఎలానో తెలుసా..?

జియో యూజర్లకు గుడ్ న్యూస్, ఎలానో తెలుసా..?

రీఛార్జ్ మాత్రమే కాదు కొత్త జియో సిమ్, జియోకు పోర్ట్ కావడం, జియో సిమ్ సపోర్ట్, జియో ఫైబర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్, జియో మార్ట్ సపోర్ట్ సేవలు జియో వాట్సప్ నెంబర్ ద్వారా లభిస్తాయి, అయితే కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా అందించే కొత్త ఫీచర్‌ను అమల్లోకి తెచ్చినట్టు జియో సంస్థ ప్రకటించింది. ఇకపై కంపెనీ ఇతర సర్వీసులను కూడా వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.

ఓటీపీ అవసరం లేకుండా కేవలం రీఫ్రెష్ చేస్తే వ్యాక్సిన్ లభ్యత సమాచారం అందించనుంది. కంపెనీ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమాధానాలను కూడా చాట్‌బోట్‌తో అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. వాటితో పాటు కరోనా వ్యాక్సిన్ లభ్యత సమాచారం కూడా అందించనున్నట్లు తెలిపింది.

అందుకోసం 70007 70007 నెంబర్‌ కు hi అని మెసేజ్ పంపితే చాట్‌బోట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పింది. జియో యూజర్లు కాకపోయినా కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత సమాచారం పొందవచ్చని.. అయితే ముందుగా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *